విశాఖలో యువకుడికి మ్యాట్రీమోనీ మోసం

యువకులు మ్యాట్రీమోనీలో పెళ్లి సంబంధాల కోసం చూస్తుంటారు. తమకు నచ్చిన అమ్మాయి కోసం రిక్వెస్ట్‌లు పంపుతుంటారు. అవతలి వైపు నుంచి అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సంబంధం సెట్టు.. అయితే మ్యాట్రీమోనీ రిక్వెస్ట్‌లు, అమ్మాయిల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చిక్కులు తప్పవు. అమ్మాయి అందంగా ఉంది కదా అని టెంప్ట్ అయితే నిండా మునిగిపోయినట్లే.. అందుకే మ్యాట్రీమోనీ విషయంలో జాగ్రత్తలు తప్పవు మరి. తాజాగా విశాఖపట్నంలో అదే జరిగింది.. ఓ యువకుడు మ్యాట్రీమోనీలోకి వెళ్లి ఓ మహిళ చేతిలో మోసపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు బయటపడగా.. అందమైన అమ్మాయిల ఫొటోలను పెట్టి వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమె మోసం చేసినట్లు తేలింది.. మహిళను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

విశాఖపట్నానికి చెందిన యువకుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి సంబంధాల కోసం‌ మ్యాట్రిమోనీకి వెళ్లారు.. అతడు రిక్వెస్టు పెట్టడాన్ని గమనించిన ఓ మహిళ ఇన్‌స్టాలో అతడ్ని పరిచయం చేసుకుంది. అతడి వాట్సాప్‌ నెంబరు తెలుసుకుని అందమైన అమ్మాయిల ఫొటోలను పెట్టి అది తనే అన్నట్లు నమ్మించింది. మనోడు కూడా నిజమేనని భావించాడు.. రోజూ ఇద్దరి మధ్య చాట్ నడుస్తోంది. యువకుడు కూడా తనకు సంబంధించి వ్యక్తిగత విషయాలను కూడా ఆ మహిళకు చెప్పాడు.

అతడ్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది మహిళ. ఆ తర్వాత కట్టు కథలు మొదలు పెట్టింది.. తనకు డబ్బులు అత్యవసరంగా కావాలని చెప్పింది. అతడు కూడా నిజమని నమ్మి ఆమెకు డబ్బులు ఇవ్వగా.. ఇలా ఆమె ఏకంగా రూ.22 లక్షలు తన అకౌంట్‌లో వేయించుకుంది. ఆ తర్వాత మనోడికి తత్వం బోదపడటంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె గురించి ఆరా తీస్తే.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ తాండాకు చెందిన బి సాయిప్రియగా గుర్తించారు. ఆమెను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మ్యాట్రీమోనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

About amaravatinews

Check Also

అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్‌.. ఆంటోనితో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌..

సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించి అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *