విశాఖపట్నంలో విచిత్రమైన ఘటన జరిగింది. తీవ్రమైన కడుపునొప్పితో వచ్చిన మహిళను పరీక్షించిన కేజీహెచ్ డాక్టర్లు రిపోర్టులు చూసి అవాక్కయ్యారు. ఆమె కడుపులో ఏకంగా శిశువు ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించారు అవాక్కయ్యారు.. వెంటనే సర్జరీ నిర్వహించి వాటిని తొలగించారు. అనకాపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. మూడేళ్ల క్రితం మరోసారి గర్భం దాల్చడంతో అబార్షన్ కోసం ఆమె మందులు వాడారు. ఆ తర్వాత కొంత కాలం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు మూడో వారంలో ఆమె కేజీహెచ్ ప్రసూతి విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఐ వాణిని మహిళ సంప్రదించారు.

వెంటనే బాధితురాలికి డాక్టర్ వాణి అల్ట్రా సౌండ్ స్కాన్ చేసి కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా.. 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు తేలింది. అత్యంత అరుదుగా తలెత్తే ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘లితోపెడియన్’గా వ్యవహరిస్తారని కేజీహెచ్ డాక్టర్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న లెక్కల ప్రకారం.. ఇటువంటి కేసులు 25 కన్నా తక్కువ నమోదయ్యాయని చెబుతున్నారు. కేజీహెచ్‌లో డా.ఆనంద్ బృందంతో కలిసి డాక్టర్ వాణి గత నెల 31న ఆమెకు శస్త్రచికిత్స చేసి కడుపులోని శిశువు ఎముకల గూడును తొలగించారు. ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్న ఆమెను.. కొద్దిరోజుల తర్వాత డిశ్ఛార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు. ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఈ వివరాలను వెల్లడించారు.
మరోవైపు భారీ వర్షాలు కురవడంతో విశాఖపట్నంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. నగరంలో జ్వర బాధితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. సోమవారం ఉదయం విశాఖపట్నం కేజీహెచ్‌కు వచ్చిన బాధితులు, వారి సహాయకులతో ఓపీ చీటీలు రాసే చోట రద్దీ కనిపించింది. ఓపీ చీటీలు తీసుకొనే ముందు ప్రభుత్వ యాప్‌లో పేర్లు, ఆధార్‌నెంబర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి ఆస్పత్రి వర్గాలు.. ఆస్పత్రిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఓపీ కేంద్రాల దగ్గర జనాలు బారులు తీరారు.