నా గన్‌మెన్‌లను వెనక్కు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి స్వరూపానంద లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు కల్పిస్తున్న భద్రతను వెనక్కు తీసుకోవాలని కోరారు విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి. ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్ (X) 1+1 భద్రతను వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌కు శారదాపీఠం తరఫున లేఖ రాశారు. 2019 నుంచి 2024 వరకూ తన భద్రత, శ్రేయస్సు కోసం ప్రస్తుత, గత ప్రభుత్వాలు పోలీసు రక్షణ అందించాయని.. 2019 నుంచి విశాఖపట్నంలోని శారదాపీఠానికి మద్దతు ఇచ్చినందుకు వైఎస్సార్‌సీపీ, కూటమి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇకపై రిషికేశ్‌లో తపస్సులోనే ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నానని.. అందుకే తనకు కేటాయించిన గన్‌మెన్‌లను వెనక్కు తీసుకోవాలని కోరారు.

విశాఖపట్నం శారదా పీఠానికి కేటాయించిన భూముల్ని కూడా ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో భీమిలి మండలం కొత్తవలస సమీపంలో కేటాయించిన 15 ఎకరాల భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల్ని అప్పటి ప్రభుత్వం నామమాత్రపై ధరకే కేటాయించారని.. నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భూ కేటాయింపుల్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. విశాఖపట్నం జిల్లా యంత్రాంగం ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *