ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరబోతోంది.. రైల్వే జోన్‌పై మరో ముందడుగు, రెండేళ్లలో పూర్తి

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. నగరంలోని ముడసర్లోవ ప్రాంతంలో ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’ ప్రధాన కార్యాలయం భవన నిర్మాణ పనులకు రైల్వే శాఖ టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ భవన సముదాయానికి సంబంధించిన డిజైన్ కూడా ఫైనల్ చేశారు. ఈ భవన సముదాయాన్ని బీ1+బీ2+జీ+9 (బేస్‌మెంట్‌ 1, 2, గ్రౌండ్, మొత్తం 9 ఫ్లోర్లు)గా నిర్మించాలని నిర్ణయించారు.. ఈ మేరకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు డీపీఆర్‌లో డిజైన్ ఆకట్టుకుంది. ఈ భవనాన్ని మొత్తం 27,548.3 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేయనున్నారు.. మొదటి అంతస్తు 3,222.83 చ.అడుగులు కాగా.. మిగిలిన అంతస్తుల్లో ఒక్కోదాన్ని 2,702.83 చ.అడుగులతో నిర్మించనున్నారు.

ఈ భవన సముదాయంలో వాహనాల పార్కింగుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదటి బేస్‌మెంట్‌లో వంద కార్లు, 125 బైక్‌లు పార్క్ చేసేలా డిజైన్ చేశారు. రెండో బేస్‌మెంట్‌లో వంద కార్లు, 90 బైక్‌లు, ఆరుబయట పార్కింగ్‌ స్థలంలో 90 కార్లు, 400 బైక్‌లు నిలిపేలా ప్లాన్ చేశారు. అలాగే ఈ భవన సముదాయం కింది అంతస్తులో కంట్రోల్‌ రూమ్, ఆడిటోరియం, బ్యాక్‌ ఆఫీసు, కిచెన్ వంటివి ఏర్పాటు చేస్తారు. మొదటి ఫ్లోర్‌లో కమర్షియల్, సీపీఆర్‌వో.. రెండో ఫ్లోర్‌లో జోనల్‌ కంట్రోల్‌ రూం, భద్రత, మరికొన్ని విభాగాలు ఏర్పాటు చేస్తారు.

మూడు ఫ్లోర్‌లో రిజర్వేషన్, టెలీ ఎక్స్ఛేంజ్‌ ఆఫీస్, మీటింగ్ హాల్, ఐటీ విభాగాలు ఉంటాయి. నాలుగో ఫ్లోర్‌లో ఆర్థిక, గణాంక, ఇంజినీరింగ్, లైబ్రరీ ఉంటాయి. ఐదో ఫ్లోర్‌లో ఆపరేటింగ్‌ విభాగం, స్టోర్, ఏడీజీఎం, జీఎం కార్యాలయం, సెక్రటరీ, అనుబంధ విభాగాలు ఉంటాయి. ఆరు ఫ్లోర్‌లో ఆఫీస్ స్పేస్.. ఏడో ఫ్లోర్‌లో విపత్తుల నిర్వహణ, సెక్రటరీ, ఎస్డీజీఎం, వైద్య విభాగం, ఏజీఎం గది ఉంటాయి. అలాగే ఎనిమిదో ఫ్లోర్‌లో పర్సనల్‌ విభాగం, క్యాంటీన్.. తొమ్మిది ఫ్లోర్‌లో ఎలక్ట్రికల్, మెకానికల్, మీటింగ్ హాల్ ఉంటాయి. ఈ మేరకు భవన సముదాయం డిజైన్లను విడుదల చేశారు.

About amaravatinews

Check Also

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర.. ఏపీలో కలకలం రేపుతున్న సంచలన వీడియో..

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరగడం సంచలనం సృష్టిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *