విశాఖ అంటేనే ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్.. సుందరమైన బీచ్ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు చూడముచ్చటైన పర్యాటక ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తూ ఉంటాయి. అందుకే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ విశాఖ రావాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారి కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తుంది ఏపీ సర్కార్. చల్లని అద్దాల బస్సుల్లో విహరిస్తూ ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖలో పర్యటించారు. విశాఖలో త్వరలోనే ప్రారంభంగానున్న డబుల్ డెక్కర్ ఈవీ బస్సులను పరిశీలించారు. పర్యాటక ఆకర్షణగా నిలవబోతున్న హప్ ఆన్, హప్ ఆఫ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే విశాఖ నగరంలో సేవలందించనున్నాయని తెలిపారు మంత్రి. పర్యాటకులకు, నగరవాసులకు అనుభూతి భరితమైన, పర్యావరణహితమైన ప్రయాణాన్ని అందిస్తాయన్నారు. డబులు డెక్కర్ బస్సులు విశాఖ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే విశాఖలో ఇప్పుడు హోహో బస్సులు పలకరించనున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో డబుల్ డెక్కర్ బస్సులు ఇప్పుడు పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచెందుకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ బస్సులో రోడ్లపై పరుగులు తీయను ఉన్నాయి. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ బస్సులు ఇప్పుడు మన వైజాగ్ బీచ్ రోడ్ లో సేవలందించనున్నాయి. డబుల్ డెక్కర్ అద్దాల బస్సులో కూర్చుని ప్రకృతి అందాలను తిలకిస్తే ఆ సంతోషం మాటల్లో చెప్పలేం. ప్రకృతి సుందర దృశ్యాలు, విశాఖ సొబగులను వినూత్నంగా చూసే అవకాశం త్వరలో రాబోతోంది. తొలిసారిగా డబ్బులు డెక్కర్ బస్సుల నుంచి ప్రకృతి అందాలు చూసేలా ఏర్పాటులు చకచగా సాగిపోతున్నాయి. ఇప్పటికే ఓ బస్సు కూడా విశాఖ చేరుకుంది. డబుల్ డెక్కర్ బస్సులో నుంచి విశాఖ ప్రకృతి అందాలను చూస్తుంటే.. మనం వైజాగ్ లో ఉన్నామా లేక విదేశాల్లో ఉన్నామా అన్న అనుభూతి కూడా కలగక మానదు. నగరంలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపుగా 25 కిలోమీటర్ల మేర బీచ్ రోడ్డు ఉంది. కానీ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో ఆ దిశగా అధికారులు దృష్టి సారించారు.
ఈ డబుల్ డెక్కర్ బస్సులను హో..హో అని పేరు ఉంది. విదేశాల్లో అలాగే వాటిని పిలుస్తూ ఉంటారు.. అంటే ‘హోప్ ఆన్ హోప్ ఆఫ్..’. ప్రపంచంలో పేరు ఉన్న ఈ బస్సులో నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. కింద పైన రెండు అంతస్తులు వీటికి అద్దాల అమరిక ప్రత్యేకత. కొన్ని ఓపెన్ టాప్ లో ఉంటాయి మరికొన్ని క్లోజ్డ్ గా బస్సులు ఉంటాయి. క్లోజ్డ్ అద్దాల బస్సులో ఉన్నవాళ్లు.. చల్లటి ఏసీలో విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇక.. పైన ఓపెన్ టాప్ ఉండే బస్సుల్లో ప్రయాణించిన వాళ్లు దిగువన కూర్చునే వారు అద్దాల నుంచి డెకప్ పై కూర్చున్న వాళ్లు ఓపెన్ ఎయిర్ నుంచి చూసేలా సీట్లను అమరుస్తారు. వాటిపై ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మయమర్చిపోయేలా వీటి డిజైన్ రూపొందిస్తారు. ఈ బస్సులను ఆర్కే బీచ్ నుంచి తెన్నేటి పార్క్ కైలాసగిరి ఋషికొండ మీదుగా తొట్లకొండ వరకు.. చేరుకొని అక్కడ నుంచి భీమిలి బీచ్ వరకు వెళ్లి వెనక్కి వచ్చేలా రూట్ ను సిద్ధం చేస్తున్నారు. అయితే ఎంత వేగంగా పర్యాటకు అందుబాటులోకి వస్తుందా ఎంత త్వరగా వాటిలో కూర్చొని హ్యాపీగా జర్నీ చేసి ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామా అన్న ఆత్రుతతో ఉన్నారు ప్రకృతి ప్రేమికులు.
ఋషికొండ బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలు కొనసాగించేలా..
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ లో సౌకర్యాలను నిశితంగా పరిశీలించారు. బీచ్ లో దుకాణాలు నడుపుతున్నవాళ్లు, లైఫ్ గార్డులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. బీచ్ లో బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగించడమే కాకుండా బీచ్ సుందరీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదే విధంగా బీచ్ లో పర్యాటక సందడి పెరగడానికి అవసరమైన చర్యలపై చర్చించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.