భారీ ఉగ్రకుట్ర భగ్నం.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు పట్టుబడ్డ ఐసిస్ ఉగ్రవాది

Independence Day: దేశంలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాజాగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆ ఉగ్రవాది వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో పంద్రాగస్టు వేడుకలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రకు ఉగ్రవాదులు తెరలేపగా.. వాటిని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అయితే ఆ ఉగ్రవాది.. భారత ప్రభుత్వం వాంటెడ్ లిస్ట్‌లో ఉండటం గమనార్హం. అతడి కోసం వెతుకుతుండగా.. తాజాగా ఢిల్లీలో ఆయుధాలతో పట్టుబడటం తీవ్ర సంచలనంగా మారింది. మరోవైపు.. ఆగస్టు 15 వ తేదీ దగ్గరికి వస్తున్న తరుణంలో తాజాగా ఢిల్లీలో ఉగ్ర కలకలం రేగడం దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు, నిఘా సంస్థలు, పోలీసులు అలర్ట్ అయ్యారు.

ఢిల్లీలోని దర్యాగంజ్‌ ప్రాంతంలో నివసించే రిజ్వాన్‌ అబ్దుల్‌ హజీ అలీ అనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాజాగా అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ స్పెషల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. అతడి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఐసిస్‌ పుణె మాడ్యూల్‌లో కీలక సభ్యుడిగా ఉన్న రిజ్వాన్ అబ్దుల్ హజీ అలీపై ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ – ఎన్ఐఏ రూ.3 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా రిజ్వాన్ అబ్దుల్ హజీ అలీకి సంబంధించిన పక్కా సమాచారం అందడంతో గురువారం రాత్రి పట్టుకున్నారు. రాత్రి 11 గంటలకు తుగ్లకాబాద్‌లోని బయోడైవర్సిటీ పార్క్‌ వద్దకు రిజ్వాన్‌ అలీ వస్తాడని విశ్వసనీయ వర్గాల ద్వారా ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన స్పెషల్ డిపార్ట్‌మెంట్ పోలీసులు.. వలవేసి అతడ్ని పట్టుకున్నారు.

ఇక రిజ్వాన్ అలీ నుంచి ఒక తుపాకీ, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అతడి వద్ద దొరికిన 2 మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేసి.. వాటిలో ఉన్న డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐసిస్ పుణె మాడ్యూల్‌లో పనిచేస్తున్న రిజ్వాన్ అలీ స్వాతంత్ర్య వేడుకల వేళ దేశ రాజధాని ఢిల్లీకి రావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీలోని పలు వీఐపీ ప్రాంతాల్లో రిజ్వాన్‌ అలీ సహా అతని అనుచరులు పలుమార్లు రెక్కీ చేసినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ఆగస్టు 15 వ తేదీన ఢిల్లీలో ఉగ్రదాడులకు వీరు కుట్రలు చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఐసిస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

About amaravatinews

Check Also

కథన సీమలో కొదమ సింహం.. మన ‘ఆకాష్’ వైపు బ్రెజిల్ చూపు..!

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత, బ్రెజిల్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఇతర భారతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *