తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో రెండ్రోజుల పాటు వానలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు

తెలంగాణలో గత వారం పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే ఇప్పట్లో వర్షాలు రాష్ట్రాన్ని వీడేలా కనిపించటం లేదు. తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు.

రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, కామారెడ్డి, కరీంనగర్‌, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, నిర్మల్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ జిల్లా్ల్లో నేడు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షానికి తోడు భారీగా ఈదురు గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉదయం పొడి వాతావరణం ఉంటుందని.. మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రానికి నగర వ్యాప్తంగా జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

About amaravatinews

Check Also

బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *