ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఇవాళ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు. అయితే కోస్తా జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి అంటున్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.
ఇవాళ అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంటున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal