ఏపీలో దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులు ఇంతే.. 

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం, ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం రాగల 12 గంటల్లో క్రమంగా బలహీనపడి ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్య తీరాన్ని దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం ప్రస్తుతం ఒడిశాలోని చిల్కా సరస్సుకు వద్ద కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు వాయుగుండం కారణంగా శనివారం ఉత్తర కోస్తా ప్రాంతంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేశారు. ఇక ఆదివారం ఉత్తర కోస్తా ప్రాంతంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడుతుందని.. ఒకట్రెండు చోట భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

దక్షిణ కోస్తాలో అనేకచోట్ల శనివారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుందన్న అమరావతి వాతావరణ కేంద్రం.. ఆదివారం పరిస్థితి కొంచెం మెరుగుపడుతుందని చెప్పింది. ఆదివారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. సోమవారం కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

రాయలసీమ విషయానికి వస్తే శనివారం అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదివారం రాయలసీమలోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *