వార ఫలాలు (ఆగస్టు 11 నుంచి ఆగస్టు 17, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం మీద శ్రద్ధ పెరుగుతుంది. మీ ప్రతిభకు, నైపుణ్యాలకు పదును పెడతారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఇలా ఉన్నాయి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
లాభ స్థానంలో శని, ధన స్థానంలో రాశ్యధిపతి కుజుడు, గురువు సంచారం కారణంగా జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూలతలు బాగా పెరు గుతాయి. హోదాలు, జీతభత్యాలు పెరగడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకుల్లేకుండా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఇంత కంటే మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయ త్నాలు విజయవంతం అవుతాయి. మిత్రుల వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. ప్రతి రోజూ విష్ణు సహస్ర నామం క్రమం తప్పకుండా పఠించడం వల్ల అనుకున్నవి సాధిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశిలో గురువు, రాశ్యధిపతి శుక్రుడు చతుర్థంలో సంచారం వల్ల ఉద్యోగ జీవితం మీద శ్రద్ధ పెరుగుతుంది. మీ ప్రతిభకు, నైపుణ్యాలకు పదును పెడతారు. కొన్ని ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాన్ని మించుతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. కుటుంబ జీవితం ఉల్లాసంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రతి నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపో తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
తృతీయ స్థానంలో రాశ్యధిపతి బుధుడు శుక్రుడితో కలిసి సంచారం చేస్తున్నందువల్ల ఏ పనిలో నైనా పురోగతి, మెరుగుదల ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయకపోవడం శ్రేయస్కరం. ప్రముఖులతో వ్యాపార సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల ప్రయోజనాలుంటాయి. కాలభైరవాష్టకం చదువుకోవడం వల్ల కష్టనష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశికి ప్రస్తుతం లాభ స్థానంలో గురు, కుజులు, ధన స్థానంలో బుధ, శుక్రులు సంచారం చేస్తు న్నందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభను, శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే సూచనలున్నాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం స్నేహితుల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. మిత్రుల సహాయంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. తరచూ లలితా సహస్ర నామం చదువుకోవడం వల్ల ప్రేమలు, పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశినాథుడైన రవి ప్రస్తుతం వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఉద్యోగ స్థానంలో కుజ, గురువుల కారణంగా ఉద్యోగ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా డిమాండు పెరుగుతుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఆశించిన ప్రాధా న్యం ఇస్తారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబంలో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మొక్కుబడులు ఏవైనా పెండింగ్ లో ఉంటే తీర్చకోవడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న రాశ్యధిపతి బుధుడిని షష్ట స్థానంలో ఉన్న శనీశ్వరుడు వీక్షిస్తు న్నందువల్ల ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉండడానికి అవకాశం ఉంది. అధి కారు లతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో నిమిషం కూడా తీరిక లేని యాక్టి విటీ ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. భాగ్య స్థానంలో ఉన్న గురువు వల్ల అనేక విధాలైన పురోగతి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగి పోతాయి. ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చులు హద్దులు దాటుతాయి. భాగ్య స్థానం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. రోజూ ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల ఆరోగ్య, ఆదాయ సమస్యలు తొలగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆరవ స్థానంలో రాహువు, దశమ స్థానంలో రవి, లాభ స్థానంలో బుధ, శుక్రుల వల్ల వృత్తి, వ్యాపా రాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా పదోన్నతితో పాటు జీతాలు బాగా పెరిగే సూచనలున్నాయి. ఆదాయ పరంగా దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరపడానికి ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాల్లో విజ యాలు సిద్ధిస్తాయి. కొన్ని ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సుందరకాండ పఠించడం వల్ల మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
దశమ స్థానంలో శుక్ర, బుధుల సంచారం, సప్తమంలో రాశ్యధిపతి కుజుడితో గురువు యుతి వల్ల వారమంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుం డదు. గురు, కుజుల అనుకూలత వల్ల వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఉద్యోగ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందు తుంది. వ్యాపారాల్లో నష్టాలు తగ్గుముఖం పడతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం ప్రస్తుతానికి శ్రేయస్కరం కాదు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది. స్కంద స్తోత్ర పఠనం వల్ల ఎటువంటి అరిష్టాలైనా తొలగిపోతాయి. ప్రతి విషయంలోనూ యత్న కార్యసిద్ధి కలుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
తృతీయంలో శని, భాగ్య స్థానంలో శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నప్పటికీ, రాశ్యధిపతి గురువు షష్ట స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం పెరిగినా అనుభవించలేని పరిస్థితి ఉంటుంది. వృథా వ్యయానికి బాగా అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి కానీ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. గట్టి ప్రయత్నంతో ఆర్థిక సమస్యలు తగ్గు తాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీ అవుతుంది. వ్యాపా రులు ఆశించిన లాభాలు గడిస్తారు. దుర్గా స్తోత్ర పఠన వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ధన స్థానంలో శనీశ్వరుడు, మూడవ స్థానంలో రాహువు, పంచమంలో గురు, కుజులుబాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కు లోటుండదు. ముఖ్యంగా ఇవి ఉద్యోగపరంగా శుభ యోగాన్ని సూచిస్తున్నాయి. వృత్తి, ఉద్యో గాల్లో హోదా పెరుగుతుంది. అధికారులు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయి, నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. గణపతి స్తోత్ర పఠనం వల్ల అప్రయత్న ధన లాభం ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
సప్తమంలో శుక్ర, బుధులు, చతుర్థంలో కుజ, గురులు కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. అయితే, ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. మనశ్శాంతి తగ్గుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా మందకొడిగా సాగు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగంలో స్థిర త్వం ఏర్పడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. రోజూ శివార్చన చేయించడం వల్ల శని దోషం తగ్గి, ప్రతి ప్రయత్నమూ సానుకూలపడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు తృతీయ స్థానంలో కుజుడితో యుతి చెంది ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాల వల్ల లాభముంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో ఆదాయ వృద్ధికి అధికార యోగానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి. దూరపు బంధువుల కారణంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సాను కూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. బంధు మిత్రు లకు అండగా నిలబడతారు. సుందరకాండ పఠనం వల్ల కష్టనష్టాల నుంచి బయటపడతారు.