Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (నవంబర్ 17 నుంచి 23, 2024 వరకు): శుభ గ్రహాల అనుకూలత వల్ల మేస రాశి వారికి ఈ వారం ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభ గ్రహాల అనుకూలత వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వ్యక్తిగతంగా కొన్ని ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో హోదా, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి లభిస్తాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను, పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కొందరు బంధుమిత్రుల్ని ఆర్థికంగా బాగా ఆదుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం పెరిగే అవకాశం ఉంది.వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ వృద్ది ప్రయత్నాలను పెంచడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది కానీ, వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. అధికారులు అదనపు బరువు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం ముఖ్యమైన వ్యవహారాలను, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడం మంచిది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశముంది. వ్యాపారాల్లో పోటీ పెరిగినప్పటికీ లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందే అవకాశం ఉంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): అనేక విధాలుగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవు తుంది. ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. చిన్నా చితకా సమస్యలున్నప్పటికీ, కుటుంబ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలవంటివి లాభాల పంట పండించే అవ కాశం ఉంది. దశమ స్థానాధిపతి కుజుడు ఇదే రాశిలో ఉండడం వల్ల ఉద్యోగ వ్యవహారాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. నిరుద్యోగు లకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం నుంచి అనుకోకుండా బయట పడతారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యల్ని కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగి విశ్రాంతి కరువవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా యాక్టి విటీ పెరగడం వల్ల శ్రమాధిక్యత ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. కొద్ది ప్రయత్నంతో కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. శత్రు, రోగ, రుణ బాధలు బాగా తగ్గి ఉంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మిత్రుల మీద అవనసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఇతరులకు మాట ఇవ్వకపోవడం మంచిది. ఇంటా బయటా కొద్దిగా పని ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం ఉంటుంది. పిల్లలు విజ యాలు సాధిస్తారు. గృహ, వాహన యోగాలకు అవకాశముంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. గృహ, వాహన ప్రయత్నాలకు ఇది అను కూల సమయం. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు మీ సమర్థతను గుర్తించి ప్రోత్సహిస్తారు. వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ముఖ్యమైన పనులన్నీ లాభసాటిగా పూర్తవుతాయి. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. కొందరు ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయా ణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరగడానికి అవకాశం ఉంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): అనుకోకుండా ఆస్తి కలిసి రావడం, ఆకస్మికంగా ధన లాభం కలగడం వంటివి జరిగే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. జీవితాన్ని మరింతగా మెరుగుపరచుకోవడానికి సంబంధించిన కోరికలు నెరవేరుతాయి. కొద్ది ప్రయత్నంతో కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమతో పాటు లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు రెండు మూడు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో పని భారం బాగా ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగుల బాధ్యతలను కూడా నిర్వర్తిం చాల్సి వస్తుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అయితే, ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది. వృత్తి, వ్యాపారాలలో లాభాలపరంగా దూసుకుపోతారు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. అత్యవసర వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభముంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలతో అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్ కు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఒకరిద్దరు స్నేహితుల వల్ల ఆర్థికంగా కొద్దిగా నష్టపోవడం జరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రస్తుతానికి‍ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయపరంగా చిన్నపాటి ప్రయత్నం కూడా బాగా విజయ వంతం అవుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన విష యాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం సానుకూ లంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులకు ఆశించిన సహకారం అందిస్తారు. లాభదాయకమైన స్నేహాలు ఏర్పడతాయి. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. అంత త్వరగా ఎవరినీ నమ్మకపోవడం మంచిది. ఇతరత్రా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో కొద్దిపాటు అనుకూలతలు కనిపిస్తాయి. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా పురోగతి చెందు తాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగి ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యలు బాగా తగ్గిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు గట్టెక్కు తారు. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదా, వేతనాలు పెరగడానికి అవ కాశం ఉంది. వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు అంచనాలను మించుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా బయటపడే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో తల దూర్చకపోవడం మంచిది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఉద్యోగ పరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

About amaravatinews

Check Also

12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగైన స్థితిలో ఉంటాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *