Insurance: ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఇన్సూరెన్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, వాహన బీమా వంటివి అందరికి తెలుసినవే. అయితే వాటిల్లో తాత్కాలిక ఇన్సూరెన్స్ సైతం ఒకటి ఉంది. వీటినే షార్ట్ టర్మ్ పాలసీలుగా పిలుస్తారు. రోజుల వ్యవధి నుంచి ఏడాది కాలం లోపు ఉండే ఇన్సూరెన్స్ పాలసీలను షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్‌గా చెబుతారు. బీమా తీసుకున్నప్పుడు అది ఆర్థిక భద్రత కల్పిస్తుంది. అయితే దీపావళి వంటి పండగల సమయంలో టపాసులు కల్చినప్పుడు గాయాలైతే సైతం బీమా రక్షణ పొందవచ్చని మీకు తెలుసా. ఇటీవలే ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్ పే 9 రూపాయలతో ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. దీపావళి రోజు టపాసులు కాల్చే సందర్భంలో గాయాలైతే ఈ పాలసీ కింద రూ.25 వేల వరకు కవరేజీ ఇస్తున్నట్లు తెలిపింది.
ఫోన్ పే తీసుకొచ్చిన ఈ ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్ టెన్యూర్ కేవలం 10 రోజులే. ఇలా స్వల్పకాలిక వ్యవధికి మాత్రమే చేసే ఇన్సూరెన్స్ పాలసీలను షార్ట్ టర్మ్ పాలసీలుగా వ్యవహరిస్తారు. ఫోన్ పే అందిస్తోనన ఈ ప్లాన్ ద్వారా హాస్పిటల్‌ళో చేరితే, డే కేర్ చికిత్స సౌకర్యాలతో పాటు ప్రమాద వశాత్తు మరణిస్తే సైతం బీమా డబ్బులు చెల్లిస్తారు. 9 రూపాయలకే రూ.25 వేల వరకు బీమా రక్షణ కల్పించడంపై చాలా మంది ప్రశంసిస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్సుల గురించి అందరికి తెలిసినా షార్ట్ టర్మ్ పాలసీల గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందుకే వాటి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పాలసీ తీసుకోవాలంటున్నారు విశ్లేషకులు.
సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్సులు ఏడాదికి తీసుకుంటారు. ఇప్పుడు ఫోన్ పే తీసుకొచ్చినట్లుగానే ఇప్పటికే కొన్ని కంపెనీలు 3 నెలలు, 6 నెలల టెన్యూర్ పై బీమా ఇస్తున్నాయి. ప్రీమియం తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తీసుకునేందుకు కొందరు మొగ్గు చూపుతుంటారు. అలాగే ఒక ఇన్సూరెన్స్ నుంచి ఇంకో బీమాకు మారెటప్పుడు తక్కువ కాల వ్యవధి కోసం ఇలాంటి వాటిని తీసుకుంటుంటారు. మరోవైపు.. ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఐఆర్‌సీటీసీ ద్వారా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇస్తారు. 45 పైసలకే రూ.10 లక్షల బీమా ఉంటుంది. ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం కలిగిన ఈ డబ్బులు వస్తాయి. ఇది ఆ ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే ఇదే తరహాలో రాపిడో, ఉబర్, ఓలా వంటి సంస్థలు తక్కువ ప్రీమియంతో ప్రయాణానికి ఇన్సూరెన్స్ ఇస్తాయి.