క్రెడిట్ కార్డు లిమిట్ అంటే ఏంటి? మీకు పరిమితి తక్కువ ఉందా.. అసలు దీనిని ఎలా పెంచుకోవాలి?

Credit Cards: క్రెడిట్ కార్డుల్ని ఇప్పుడు చాలా మంది వినియోగిస్తున్నారు. నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇవి కొనుగోళ్లు చేసే సౌలభ్యాన్ని అందిస్తాయి. క్రెడిట్ కార్డులపై మనకు కొంత లిమిట్ ఇస్తాయి బ్యాంకులు లేదా ఇతర క్రెడిట్ జారీ సంస్థలు. వస్తువులు లేదా ఇతర సేవల చెల్లింపుల కోసం ఆ పరిమితి మేరకు తక్షణ చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే క్రెడిట్ కార్డులు కూడా కొన్ని ప్రయోజనాలు, నష్టాలతో వస్తాయి. క్రెడిట్ కార్డుల్ని బాధ్యతాయుతంగా ఉపయోగించడం వల్ల కలిగే బెనిఫిట్స్ సహా కార్డ్ లిమిట్ గురించి తెలుసుకోవాలి. క్రెడిట్ లిమిట్ అనేది ఒక వ్యక్తి.. క్రెడిట్ కార్డుపై ఖర్చు చేయగల గరిష్ట మొత్తం అని చెప్పొచ్చు. ఇక క్రెడిట్ కార్డు లిమిట్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. మారుతుంటుందని చెప్పొచ్చు.

>> క్రెడిట్ కార్డు పరిమితిని కార్డు జారీ చేసే సంస్థ నిర్ణయిస్తుంది. ఇక కార్డుపై నిర్ణయించిన లిమిట్ వరకు ఖర్చు చేయొచ్చు. ఒకవేళ లిమిట్ దాటితే ఆ ఖర్చును కొన్ని బ్యాంకులు అనుమతించవు. ఇంకొన్ని బ్యాంకులు ఇక్కడ ఓవర్ లిమిట్ ఛార్జీలు విధిస్తుంటాయి. బ్యాంకును బట్టి ఛార్జీలు మారతాయి. అయితే ఓవర్ లిమిట్ సదుపాయం ఉపయోగించడం వల్ల క్రెడిట్ స్కోరుపై నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీని వల్ల ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో రుణ ఆమోదం పొందే అవకాశాలు తగ్గుతాయి.

ఉదాహరణకు మీ క్రెడిట్ లిమిట్ రూ. 50 వేలు అనుకుందాం. ఇప్పటికే రూ. 15 వేలు వాడితే ఇంకా రూ. 35 వేలు ఉంటాయి. అయితే.. బిల్లింగ్ సమయం అయిన తర్వాత 20 రోజుల వరకు బిల్లు చెల్లించేందుకు గడువు ఉంటుంది. ఈ గడువులో కూడా మీరు 35 వేల పరిమితిలోనే ఉంటారు. బిల్లును పూర్తిగా చెల్లించిన తర్వాత మాత్రమే.. తిరిగి రూ. 50 వేల లిమిట్ పొందొచ్చు.

>> మీ క్రెడిట్ లిమిట్ నిర్వహించే విధానాన్ని సమీక్షించాక.. క్రెడిట్ స్కోరు 750 దాటి ఇంకా మెరుగ్గా ఉంటే.. కార్డుపై లిమిట్ పెంచాలని బ్యాంక్ నిర్ణయించుకోవచ్చు. లిమిట్ పెంచడం గురించి కార్డు దారుడికి తెలియజేసి.. అనుమతి పొందిన తర్వాత లిమిట్ పెంచుతారు. ఇంకా ప్రతి నెలా కార్డుపై చేసే ఖర్చులు పెరుగుతున్నప్పుడు కూడా లిమిట్ పెంచమని బ్యాంకును కోరొచ్చు. ముఖ్యంగా మీకు జీతం పెరిగితే.. అప్పుడు దాని ప్రూఫ్స్ ఇచ్చి.. లిమిట్ పెంచమని కోరొచ్చు. ఇతర ఆదాయ మార్గాలు ఉన్నా దానిని చూయించి కూడా లిమిట్ పెంచుకోవచ్చు.

>> క్రెడిట్ కార్డుతో పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసినప్పుడు.. దానిని ఒకేసారి తీర్చలేం అనుకుంటే దాన్ని ఈఎంఐగా మార్చుకోవచ్చు. దీనినే ఫ్లెక్సీ పే గా పేర్కొంటారు. పెద్ద మొత్తాన్ని చిన్న సమానమైన నెలవారీ వాయిదాగా మార్చమని బ్యాంకును అభ్యర్థించొచ్చు. ఇక్కడ ఈఎంఐకి మారితే వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

About amaravatinews

Check Also

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు!

Budget-2025: మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2025 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *