ఏప్రిల్ నెల నివేదికను విడుదల చేసిన వాట్సప్
నిబంధనలు ఉల్లంఘించే ఖాతాలపై ప్రత్యేక దృష్టి
సైబర్ ఫ్రాడ్.. మోసాలు..హానికరమైన కంటెంట్లు ప్రచురించే అకౌంట్లకు చెక్
ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులపై శ్రద్ధవహిస్తూనే ఉంది. వాట్సాప్ కి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో నిలదొక్కుకోలేలపోయాయి. యూజర్స్ అవసరాలు, అభిరుచిని బట్టి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇవ్వటమే ఇందుకు కారణమని చెప్పచ్చు. ఇవే కాకుండా తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకునే వారిపై వాట్సప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొన్ని భారతీయ ఖాతాలపై వాట్సాప్ నిషేధించింది. ఇప్పటికే దాదాపు 71 లక్షల భారతీయుల ఖాతాలను పూర్తిగా మూసేసింది. వాటిలో అత్యధిక ఖాతాలు సైబర్ ఫ్రాడ్, మోసాలకు సంబంధించినవని, మరికొన్ని వాట్సాప్ విధానాలను ఉల్లంఘించినవని వాట్సప్ నివేదిక వెల్లడించింది.
వాట్సాప్ ఏప్రిల్ కి సంబంధించిన నెలవారీ నివేదికను విడుదల చేసింది. 71,82,000 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు మెటా మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది. ఈ ఖాతాలు ఏప్రిల్ 1, 2024 నుంచి ఏప్రిల్ 30, 2024 మధ్య ముసేసినట్లు తెలిపింది. ఈ వ్యక్తులు యాప్‌ను దుర్వినియోగం చేశారని పేర్కొంది. వాస్తవానికి, కంపెనీ అధునాతన మెషీన్ లెర్నింగ్, డేటా విశ్లేషణను ఉపయోగిస్తుంది. దీని ద్వారా అనుమానాస్పద కార్యాచరణ ఉన్న ఖాతాలను త్వరగా గుర్తిస్తుంది. ఎందుకంటే ఈ యాప్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ వినియోగదారులను కలిగి ఉంది. వారు ప్రతిరోజూ ఈ అనువర్తనాన్ని ఉపయోగిస్తున్నారు. సందేశాలు, ఫోటోలు, వీడియోలు, ఆడియో సందేశాలను ఒకరికొకరు పంచుకుంటున్నారు. వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వాట్సప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. కాగా.. నిషేధించిన సైబర్ ఫ్రాడ్, మోసాలకు సంబంధించినవని, హానికరమైన కంటెంట్‌ను ప్రచురించే, చట్టలను ఉల్లంఘించినవి ఉన్నట్లు వాట్సప్ వెల్లడించింది. భవిష్యత్తులో వినియోగదారులు కంపెనీ విధానాన్ని ఉల్లంఘిస్తే, వారిపై కూడా నిషేధం విధిస్తామని కంపెనీ తెలిపింది.