కేంద్రం కీలక నిర్ణయం.. విండ్ ఫాల్ ట్యాక్స్ ఎత్తివేత.. 

Petrol Price: అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టిన క్రమంలో దేశీయం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న క్రూడ్ పెట్రోలియంపై (ముడి చమురు)పై విండ్ ఫాల్ ట్యాక్స్ ఎత్తివేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటన చేసింది. అంటే దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకు చేస్తు సవరణలు చేసింది. సెప్టెంబర్ 18, 2024 నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది.

ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం కింద దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న క్రూడ్ ఆయిల్‌పై ఈ విండ్ ఫాల్ ట్యాక్సును జులై 19, 2022 నుంచి విధిస్తోంది కేంద్రం. అయితే, అప్పటి నుంచి చూసుకుంటే రెండు సార్లు మాత్రమే ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్సును సున్నాకు చేసింది. ఇంతకు ముందు ఏప్రిల్ 4, 2023న ఈ ట్యాక్సును జీరోకు చేసింది. మళ్లీ ఇప్పుడు జీరోకు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ రేట్లను సమీక్షించి సవరిస్తుంటుంది కేంద్రం. గ్లోబల్ మార్కెట్‌లోని పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా రెట్లలో మార్పులు ఉంటాయి. దేశీయంగా ఉత్పత్తి అయ్యే క్రూడ్ ఆయిల్ సహా గ్యాసోలిన్, డీజిల్, ఏటీఎఎఫ్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తోంది. దేశీయ వ్యాపారులు ముడి చమురును విదేశాలకు ఎగుమతి చేస్తూ లాభాలు ఆర్జిస్తున్న క్రమంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఈ ట్యాక్స్ అమలులోకి తీసుకొచ్చింది.

కేంద్ర ప్రభుత్వ గత ఆగస్టు 31, 2024 రోజున విండ్ ఫాల్ ట్యాక్సును టన్నుకు రూ.2,100 నుంచి రూ.1850కి తగ్గించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆగస్టు 17వ తేదీన సవరించింది. టన్నుకు 2,400గా ఉన్న ట్యాక్సును రూ.2100కు తగ్గించింది. అయితే, ఇప్పుడు ఒక్కసారిగా పూర్తిగా తొలగించి రూ.1850 నుంచి జీరోకు చేయడం గమనార్హం. ప్రస్తుతం గ్లోబల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 75 డాలర్ల వద్ద ఉన్నాయి.

About amaravatinews

Check Also

చల్లటి సాయంత్రానికి వేడి వేడి బ్రెడ్ పకోడా.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు..

ఈ బ్రెడ్ పకోడాను రెండు విభిన్న పద్ధతుల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం: ఒకటి సాధారణ బ్రెడ్ పకోడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *