అమరావతికి మహర్దశ.. కేంద్రం సమక్షంలో చర్చలు.. రూ.వేల కోట్లకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దశ తిరగబోతోంది. అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ (ADB) బ్యాంక్‌లు రుణం మంజూరు చేసేందుకు ఫైనల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖతో.. ఆంధ్రప్రదేశ్ అధికారులు, సీఆర్డీఏ జరుపుతున్న చర్చలు సఫలం అయ్యాయి. ఈ చర్చల్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయం చేయగా.. ఈ రుణానికి సంబంధించి ఎంవోయూ జరగలేదు. అయితే ఈ రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లు విధించిన షరతులు, నిబంధనల్ని కేబినెట్ ముందు ఉంచుతారు. అదేవిధంగా ప్రపంచ బ్యాంక్, ఏడీబీలు తుది ఆమోదం కోసం ఈ ఒప్పందాన్ని వారి సంబంధిత బోర్డులకు పంపిస్తాయి.

సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఈ రుణానికి సంబంధించిన ప్రతిపాదనల్ని సమర్పించారు. అలాగే వీటిని రుణాలు ఇచ్చే ఏజెన్సీలు పరిశీలించిన తర్వాత.. వారు లేవనెత్తిన సందేహాలు, సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఇటీవల వరల్డ్ బ్యాంక్ సీనియర్ అధికారులతో పాటుగా ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు.. అక్కడ స్థానికులతో, రైతులతో, కూలీలతో మాట్లాడారు. రాజధానిలో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. అయితే సీఆర్డీఏ సమర్పించిన భారీ నివేదికలను పరిశీలించిన తర్వాత.. ప్రపంచ బ్యాంకు, ADB బృందాలు ఒప్పందంలోని వివిధ అంశాలను పరిశీలించికేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ అధికారులతో చర్చలు జరిపాయి.

About amaravatinews

Check Also

విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు.. ఈసీ సంచలన ప్రకటన

MLC Election: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు అయింది. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *