తోడేళ్లు కనిపిస్తే కాల్చిపారేయండి.. యోగి సర్కార్ సంచలన ఆదేశాలు

UP Govt: గత కొన్ని రోజులుగా ఉత్తర్‌ప్రదేశ్‌లో తోడేళ్ల దాడులు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. కనిపించిన వారిపై కనిపించినట్లే దాడులు చేయడంతో ఇప్పటివరకు 10 మంది మృత్యువాతపడ్డారు. మరో 30 మందికిపైగా తోడేళ్ల దాడుల్లో గాయపడ్డారు. ఇక చనిపోయిన 10 మందిలో 9 మంది చిన్న పిల్లలే కావడం తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా తోడేళ్లు చేస్తున్న దాడులను నివారించేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని తోడేళ్లను అధికారులు పట్టుకోగా.. మరికొన్ని మాత్రం చిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ తోడేళ్లు చాలా పకడ్బందీగా అదును చూసి దాడులు చేస్తుండటంతో యూపీ సర్కార్ కీలక ఆదేశాలు ఇచ్చింది. మనుషులను చంపే తోడేళ్లు ఎక్కడ కనిపించినా అక్కడే కాల్చి పడేయాలని సూచించింది.

ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్‌ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. గత కొన్ని నెలలుగా మహసి ప్రాంతంలో మొత్తం 6 తోడేళ్ల గుంపు జనావాసాల్లో సంచరిస్తూ.. ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు కారణం అవుతోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ భేడియా చేపట్టిన అటవీ శాఖ అధికారులు.. ఇప్పటివరకు 4 తోడేళ్లను పట్టుకున్నారు. మరో రెండు తోడేళ్లు మాత్రం అధికారులకు చిక్కకుండా ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇక ఈ తోడేళ్లు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 10 మంది దుర్మరణం చెందగా.. 30 మందికి గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిలో 9 మంది చిన్నారులు ఉండటం తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. సోమవారం రాత్రి కూడా ఓ 5 ఏళ్ల చిన్నారిపై తోడేలు దాడి చేసింది.

ఇక ప్రతి 4, 5 రోజులకు ఒకసారి తోడేళ్లు కొత్త గ్రామంపై దాడి చేస్తున్నాయని బహరాయిచ్‌ జిల్లా కలెక్టర్‌ రాణి వివరించారు. దీంతో అవి ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడులు చేస్తున్నాయో అంచనా వేయడం సవాల్‌గా మారుతోందని చెప్పారు. రాత్రివేళల్లో తలుపులన్నీ మూసివేసి ఇంట్లోనే నిద్రపోవాలని ప్రజలకు సూచించామని.. తోడేళ్ల కదలికలను డ్రోన్లతో తెలుసుకుంటున్నామని తెలిపారు. ఇక తోడేళ్లను పట్టుకునేందుకు అటవీ అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. టెడ్డీబేర్‌ బొమ్మలకు చిన్నారుల దుస్తులు వేసి.. పిల్లల మూత్రంతో తడిపేసి.. తోడేళ్లు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులు అన తోడేళ్లు గ్రహించి అక్కడికి చేరుకుంటే వాటిని ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

About amaravatinews

Check Also

చల్లటి సాయంత్రానికి వేడి వేడి బ్రెడ్ పకోడా.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు..

ఈ బ్రెడ్ పకోడాను రెండు విభిన్న పద్ధతుల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం: ఒకటి సాధారణ బ్రెడ్ పకోడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *