YS Sharmila: వైఎస్ కుటుంబంలో జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు.. బయటికి రావడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఈ వివాదంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించగా.. ఆ వ్యాఖ్యలకు ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అన్ని కుటుంబాల్లో ఉండే వివాదమే తమ ఇంట్లో ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయిన షర్మిల.. ప్రతీ ఇంట్లో తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఇది సామాన్యమైన విషయం కాదు జగన్ సర్ అంటూ షర్మిల ఎద్దేవా చేశారు.
తమ కుటుంబంలో తలెత్తిన ఆస్తుల వివాదంపై స్పందించిన వైఎస్ షర్మిల.. గొడవలు పెట్టుకోవాలని తమ ఉద్దేశం కాదని అన్నారు. సామరస్యంగా, 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలని తమకు తెలుసని చెప్పారు. ఆస్తి గొడవలు సామాన్యమని.. అన్ని కుటుంబాల్లో జరిగేది అంటూనే.. తల్లిని, చెల్లిని వైఎస్ జగన్ కోర్టుకు ఈడ్చారని పేర్కొన్న షర్మిల.. ఇది సామాన్య విషయం కాదు జగన్ సార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెల్లిపై ప్రేమతోనే జగన్ షేర్లు ట్రాన్స్‌ఫర్ చేశారు అనేది పచ్చి అబద్ధమని షర్మిల తెలిపారు.
Amaravati News Navyandhra First Digital News Portal