YS Jagan: చంద్రబాబు, బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి క్రూర రాజకీయాలు ఎవరూ చేయరంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఎవరిపై అయినా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారని ఆరోపించారు. అందరి కుటుంబాలలో మాదిరిగానే తమ కుటుంబంలోనూ విబేధాలు ఉన్నాయన్న వైఎస్ జగన్.. తల్లీ, చెల్లి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తనతో పాటుగా తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ గురించి కూడా తప్పుడు పోస్టులు పెట్టారని వైఎస్ జగన్ ఆరోపించారు.

చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఇంటి నుంచే ఈ పోస్టులు పెట్టినట్లు హైదరబాద్ పోలీసుల విచారణలో తేలిందన్నారు జగన్. ఐటీడీపీ ద్వారా తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేశారని.. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉదయ్ భూషణ్ అనే ఐటీడీపీ సభ్యుడి ద్వారా వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి తన తల్లి విజయమ్మను, చెల్లి షర్మిలను తిట్టించారని జగన్ ఆరోపించారు. ఫిబ్రవరిలో ఉదయ్ భూషణ్‌ను అరెస్ట్ కూడా చేసినట్లు చెప్పారు. రాజకీయ స్వార్థం కోసం ఎంత నీచానికికైనా చంద్రబాబు దిగజారతాడన్న వైఎస్ జగన్.. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడతారని, మన కర్మ కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో పుట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నవాళ్లు చనిపోతే తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు.

” అయ్యా చంద్రబాబు.. నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా.. నీకు మానవతా విలువ గురించి మాట్లాడే నైతికత ఉందా? నీ తల్లిదండ్రులతో ఎప్పుడైనా కలిసి ఉన్నావా.. రాజకీయంగా ఎదిగిన తర్వాత నీ ఇంటికి వారిని తీసుకువచ్చి రెండు పూటల భోజనం పెట్టావా.. వారు కాలం చేస్తే కనీసం తలకొరివి అయినా పెట్టావా.. మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయం కోసం ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైనా ఆడతాడు. ఇలాంటి వ్యక్తితో మేము యుద్ధం చేస్తున్నాం.” అంటూ జగన్ విమర్శించారు.

About amaravatinews

Check Also

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *