అయోధ్యలోని వానరాలకు దీపావళి గిఫ్ట్.. హీరో అక్షయ్ కుమార్ మంచి మనసు

Akshay Kumar: అయోధ్యలో ఉండే కోతులకు ఆహారాన్ని అందించి.. హీరో అక్షయ్ కుమార్ తన దాతృత్వాన్ని మరోసారి బయటపెట్టారు. దేశం నలుమూలల నుంచి అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులపై అక్కడ ఉండే కోతులు ఆహారం కోసం దాడి చేస్తుండటం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్న వేళ.. బాలరాముడి ఆలయం వద్ద ఉన్న వానరాల కోసం అక్షయ్ కుమార్.. ఫీడింగ్ వ్యాన్‌ను పంపించారు. దీపావళి పండగ సందర్భంగా అక్షయ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన తల్లిదండ్రులకు నివాళులు అర్పిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్షయ్ కుమార్ వెల్లడించారు.

దీపావళి పండగ సందర్భంగా అయోధ్యకు వచ్చే భక్తులకు.. అక్కడ ఉన్న కోతులు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వాటికి అవసరమైన ఆహారం కోసం తన వంతు సాయం చేశారు. అయితే అయోధ్య రామమందిరం చుట్టుపక్కల ఉన్న కోతులకు ఆహారం ఏర్పాటు చేయడం ఇదేం తొలిసారి కాదు. అయోధ్య రామమందిరం ప్రారంభం అయినప్పటి నుంచి అక్కడ ఉన్న వానరాలకు ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయోధ్య నగర శివార్లలోని సురక్షిత ప్రాంతంలో సుమారు 1200 కోతులకు నిత్యం ఆహారాన్ని అందిస్తున్నారు.

About amaravatinews

Check Also

మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా..? ఈ ట్రిక్స్‌తో వేగంగా పెంచుకోండి..!

Credit Score: బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రుణాలు కావాలంటే ముందుగా చూసేది క్రెడిట్‌ స్కోర్‌. ఇది బాగుంటేనే రుణాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *