ట్విస్ట్ ఇచ్చిన ఆమ్రపాలి సహా ఆ ఇద్దరు.. క్యాట్‌లో పిటిషన్.. సీఎం రేవంత్ రంగంలోకి దిగుతారా..?

తెలంగాణలో కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్‌ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఏపీలో కొనసాగుతున్న తెలంగాణ కేడర్ అధికారులు.. తమ సొంత రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని ఇటీవల కేంద్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‎గా కొనసాగుతోన్న ఆమ్రపాలితో పాటు మిగతా 10 మంది అధికారులకు డిపార్ట్‏మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సెంటర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16లోగా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉండగా.. ఐఏఎస్‌లు ట్విస్ట్ ఇచ్చారు. డీఓపీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమ్రపాలి సహా నలుగురు ఐఏఎస్‎లు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT)ను ఆశ్రయించారు. ఐఏఎస్‎లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, సృజన, వాణి ప్రసాద్ వేర్వేరుగా క్యాట్‏లో పిటిషన్లు దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి.. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమ్రపాలితో పాటు వాకాటి కరుణ, వాణి ప్రసాద్ క్యాట్‎కు విజ్ఞప్తి చేశారు. ఇక.. తనను ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ సృజన కూడా క్యాట్‎లో పిటిషన్ దాఖలు చేశారు. ఐఏఎస్‎లు వేసిన పిటిషన్లపై రేపు (అక్టోబర్ 15న) క్యాట్ విచారణ చేపట్టనుంది.

అయితే.. తమను తెలంగాణ కేడర్‌లోనే కొనసాగించాలంటూ 11 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. 11 మంది అధికారులు వెంటనే సొంత రాష్ట్రంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తనకు తెలంగాణ కేడర్ కావాలని ఆమ్రపాలి కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె విజ్ఞప్తిపై సమీక్షించిన డీఓపీటీ.. తెలంగాణ కేడర్‌ను కేటాయించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే క్రమంలోనే.. తెలంగాణ విద్యుత్ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్‌కు కూడా ఇవే ఆదేశాలు ఇచ్చింది.

About amaravatinews

Check Also

 అద్దె ఇంటి కోసం వచ్చి.. ఎంత పని చేశారు.. వామ్మో మీరు జాగ్రత్త!

ఇంట్లో అద్దెకు దిగుతున్నట్లు నటించిన దొంగలు, బంగారం, నగదు కోసం ఇంటి యాజమానులైన వృద్ధ దంపతులను హతమార్చారు.ఖమ్మం జిల్లా వృద్ధ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *