ఏపీలో రైతులకు శుభవార్త.. రూ.19,000 ఫిక్స్, కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పామాయిల్‌ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పామాయిల్ రైతులు, కంపెనీల యాజమాన్యాలు, ఆయిల్‌ఫెడ్, ఉద్యానశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.. ప్రధానంగా ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణపై చర్చించారు. పామాయిల్‌ ధరలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పామాయిల్ రైతులకు ఊరట లభించింది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలలకే టన్ను ధర రూ.12,500 నుంచి ఏకంగా రూ.19,000కి ధర పెరిగింది అంటున్నారు.

గత ప్రభుత్వం పాలనలో ఒక సందర్భంలో.. టన్నుకు రూ.23 వేల అత్యధిక ధర పెరగడంతో చాలామంది కౌలు రైతులు ఇదే ధర కొనసాగుతుందని ఆశపడ్డారు. ముందుగానే ఎకరానికి రూ.లక్ష ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి కౌలుకు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ధర రూ. 12 వేలకు తగ్గింది.. దీంతో రైతులు నష్టపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర పెరిగింది అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల సమయంలో రూ.12,500 నుంచి రూ.19,000కి పెరిగిం ది. త్వరలో పామాయిల్‌ ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. తమకు గిట్టుబాటు ధరే దక్కుతుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న పెట్టుబడులను చూస్తే టన్నుకు రూ.18 వేలు లేకపోతే గిట్టుబాటు కాదంటున్నారు రైతులు. అయితే రూ. 19,000 ధర పలకడం ఆనందంగా ఉందంటున్నారు. అయితే పామాయల్ సాగును విస్తరించాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు కేంద్రం కూడా పామాయిల్ రైతులకు తీపికబురు చెప్పింది. ముడి పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి 27.5శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. దిగుమతి సుంకం పెంపు వలన పామాయిల్‌ పండించే రైతులకు లబ్ధి చేకూరుతుంది అంటున్నారు. మొత్తం మీద ఏపీలో పామాయిల్ రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించింది.. మద్దతు ధర పలుకుతోంది అంటున్నారు.

About amaravatinews

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *