చంద్రబాబు సర్కార్ పెద్ద మనసు.. అచ్యుతాపురం ఘటన మృతులకు రూ.కోటి పరిహారం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.. అలాగే గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.. వారికి కూడా పరిహారం అందజేస్తామన్నారు. మరోవైపు కేంద్రం తరఫున కూడా ప్రధాని నరేంద్ర మోదీ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. 17 మంది మృతి చెందడంపై సంతాపం తెలియజేశారు.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాకు వెళుతున్నారు. ముందుగా ఈ ప్రమాదం బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. చంద్రబాబు ఉదయం 10:30 కు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు చంద్రబాబు బయలుదేరి వెళతారు. మృతుల కుటుంబాలను.. ప్రమాదంలో గాయపడిన కంపెనీ సిబ్బందిని పరామర్శించి, వైద్య బృందాలతో చంద్రబాబు మాట్లాడతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు బయలుదేరి ఉండవల్లి నివాసానికి వెళతారు.

మరోవైపు అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదంపై గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, పరిశ్రమల మంత్రి టీజీ భరత్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు తక్షణ ఆర్థిక, వైద్య సహాయం అందించాలని సూచించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామన్నారు. బుధవారం ఈ ఫార్మా కంపెనీలోని పేలుడు ఘటనలో 18మంది చనిపోగా.. 40మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

ఈ పేలుడు తర్వాత మంటలను అదుపు చేసేందుకు ఆరు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది తీవ్రంగా కష్టపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి.. పొడవైన క్రేన్‌తో అద్దాలను పగలగొట్టి, గాయాలతో ఉన్న కార్మికులను అతికష్టం మీద బటయుక తీసుకొచ్చారు. గాయపడినవారిని అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లి, విశాఖపట్నంలోని ఆసుపత్రులకు తరలించారు.

About amaravatinews

Check Also

ఫాంహౌస్ నుంచి రాత్రి కాంట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు.. ఉదయాన్నే సేమ్ ప్లేస్‌లో షాకింగ్ సీన్..!

రాత్రి కిడ్నాప్.. ఉదయానికి శవమై కనిపించిన కాంట్రాక్టర్.. శ్రీ సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ కిడ్నాప్ అండ్ మర్డర్ సంచలనం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *