ఏపీ రాజధాని అమరావతి పరిధిలోకి ఈ మూడు ప్రాంతాలు.. కీలక ఆదేశాలు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) పరిధిని తిరిగి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజధాన పరిధిని మళ్లీ 8,352.69 చదరపు కిలో మీటర్లకు ప్రభుత్వం పెంచింది. పల్నాడు, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థల్లో గత ప్రభుత్వం విలీనం చేసిన ప్రాంతాన్ని తిరిగి సీఆర్డీఏలోకి కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాలోని 92 గ్రామాల్లో 1,069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, సత్తెనపల్లి మున్సిపాలిటీ, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని 562.41 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం సీఆర్డీఏ పరిధిలోకి వచ్చాయి. మొత్తం 1,631.96 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణాన్ని తిరిగి సీఆర్డీఏలోకి రాగా.. దీనికి సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చారు.

మరోవైపు రాష్ట్రంలో రోడ్లను పీపీపీ/ బీఓటీ విధానంలో అభివృద్ధి చేసేందుకు సాధ్యాసాధ్యాలపై ముందస్తు అధ్యయనానికి సలహా సంస్థల నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. అన్ని జిల్లాల్లో 68 రోడ్లకు సంబంధించి ఉత్తర్వు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. మొదటి ప్యాకేజీలో 17, రెండో ప్యాకేజీలో 18, మూడో ప్యాకేజీలో 18, నాలుగో ప్యాకేజీలో 14 రోడ్లు కలిపి మొత్తం 3,931 కి.మీ మేర అధ్యయనం చేయనున్నారు. ఈ మేరకు ఈ అధ్యయనానికి రూ.6.98 కోట్లు కేటాయించినట్లు ఆర్‌అండ్‌బీశాఖ తెలిపింది.

ఏపీలో ఆలయాలు, ఛారిటబుల్‌ సంస్థల వార్షిక ఆదాయ పరిమితిని బట్టి వాటిని దేవాదాయశాఖ పరిధిలో 3 కేటగిరీలు ఉన్నాయి. అయితే ఈ ఆదాయ పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.25 లక్షలకుపైగా వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలను ‘6ఏ’గా, రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఆదాయం ఉన్న వాటిని ‘6బీ’గా, రూ.2 లక్షలోపు ఉన్న వాటిని ‘6సీ’గా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిమితులు 2008లో ఖరారు చేయగా.. వాటిని పెంచాలని దేవాదాయశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు రూ.50 లక్షలకుపైగా వార్షిక ఆదాయం ఉన్న వాటిని ‘6ఏ’గా మార్చారు. రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉన్నవాటిని ‘6బీ’గా, రూ.15 లక్షలలోపు ఉన్న వాటిని ‘6సీ’గా పరిగణిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వు జారీ చేసింది.

About amaravatinews

Check Also

వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? వామ్మో.. ఈ సమస్యలుంటే గుండెపోటు వస్తుందట జాగ్రత్త..

చలికాలంలో చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తారు.. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా చేస్తుంటారు.. అయితే.. వేడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *