ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది.. మొత్తం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ 20 పదవుల్లో.. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి ఒక కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అప్పగించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ జాబితాలో ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో యువతకు పెద్ద పీట వేశారు.. 11 మంది కస్టర్ ఇన్‌ఛార్జ్‌లు, ఆరుగురు యూనిట్ ఇన్‌చార్జ్‌లకు పదవులు దక్కాయి. ఓ క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌కు ఛైర్మన్ పదవి ఇచ్చారు. మొత్తం 99 మందితో జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది.
వక్ఫ్ బోర్డు ఛైర్మన్ – అబ్దుల్ అజీజ్ (టీడీపీ)
శాప్ ఛైర్మన్ – రవినాయుడు (టీడీపీ)
గృహనిర్మాణ బోర్డ్ ఛైర్మన్ – తాతయ్యనాయుడు (టీడీపీ)
ఏపీఐఐసీ ఛైర్మన్ – మంతెన రామరాజు (టీడీపీ)
మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్ – దామచర్ల సత్య (టీడీపీ)
20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ – లంకా దినకర్ (టీడీపీ)
ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ – కొనకళ్ల నారాయణ (టీడీపీ)
ఆర్టీసీ వైస్ ఛైర్మన్ – పీఎస్ మునిరత్నం (టీడీపీ)
టూరిజంశాఖ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – నూకసాని బాలాజీ (టీడీపీ)
SEEDAP ఛైర్మన్ – దీపక్ రెడ్డి (టీడీపీ)
AP TRICAR ఛైర్మన్ – బొరగం శ్రీనివాసరావు (టీడీపీ)
మార్క్‌ఫెడ్ ఛైర్మన్ – కర్రోతు బంగార్రాజు (టీడీపీ)
సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – మన్యం సుబ్బారెడ్డి (టీడీపీ)
పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ఛైర్మన్- పీలా గోవింద సత్యనారాయణ (టీడీపీ)
పద్మశాలి వేల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – నందం అబద్ధయ్య (టీడీపీ)
లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – పిల్లి మాణిక్యాలరావు (టీడీపీ)
వినియోగదారుల రక్షణ కౌన్సిల్ ఛైర్మన్ – పీతల సుజాత (టీడీపీ)
ఏపీ MSME డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన పార్టీ)
ఏపీ సివిల్స్ సప్లై కార్పొరేషన్ – తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన పార్టీ)
APTPC ఛైర్మన్ – వజ్జా బాబూరావు (టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ TIDCO ఛైర్మన్ – వేనుములపాటి అజయ్ కుమార్ (జనసేన పార్టీ)
ఈ నామినేటెడ్ పోస్టుల్లో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి దక్కింది. ఆయన మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీచేయాలని భావించారు.. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన పార్టీకి వెళ్లింది. అయినా సరే ఆయన కూటమి గెలుపు కోసం పనిచేశారు.. అందుకే నామినేటెడ్ పోస్టుల్లో ఆర్టీసీ ఛైర్మన్ పదవి దక్కింది. ఆయన టీడీపీలో సీనియర్ నేత కావడంతో కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.