20 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ.. మాజీ ఎంపీకి బంపరాఫర్, కీలక పదవి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది.. మొత్తం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ 20 పదవుల్లో.. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి ఒక కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అప్పగించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ జాబితాలో ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో యువతకు పెద్ద పీట వేశారు.. 11 మంది కస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు, ఆరుగురు యూనిట్‌ ఇన్‌చార్జ్‌లకు పదవులు దక్కాయి. ఓ క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌కు ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. మొత్తం 99 మందితో జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది.

వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ – అబ్దుల్‌ అజీజ్‌ (టీడీపీ)
శాప్‌ ఛైర్మన్‌ – రవినాయుడు (టీడీపీ)
గృహనిర్మాణ బోర్డ్ ఛైర్మన్‌ – తాతయ్యనాయుడు (టీడీపీ)
ఏపీఐఐసీ ఛైర్మన్‌ – మంతెన రామరాజు (టీడీపీ)
మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్‌ – దామచర్ల సత్య (టీడీపీ)
20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌ – లంకా దినకర్ (టీడీపీ)
ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌ – కొనకళ్ల నారాయణ (టీడీపీ)
ఆర్టీసీ వైస్ ఛైర్మన్ – పీఎస్ మునిరత్నం (టీడీపీ)
టూరిజంశాఖ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ – నూకసాని బాలాజీ (టీడీపీ)
SEEDAP ఛైర్మన్‌ – దీపక్ రెడ్డి (టీడీపీ)
AP TRICAR ఛైర్మన్‌ – బొరగం శ్రీనివాసరావు (టీడీపీ)
మార్క్‌ఫెడ్ ఛైర్మన్ – కర్రోతు బంగార్రాజు (టీడీపీ)
సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – మన్యం సుబ్బారెడ్డి (టీడీపీ)
పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ ఛైర్మన్- పీలా గోవింద సత్యనారాయణ (టీడీపీ)
పద్మశాలి వేల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – నందం అబద్ధయ్య (టీడీపీ)
లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – పిల్లి మాణిక్యాలరావు (టీడీపీ)
వినియోగదారుల రక్షణ కౌన్సిల్‌ ఛైర్మన్ – పీతల సుజాత (టీడీపీ)
ఏపీ MSME డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన పార్టీ)
ఏపీ సివిల్స్ సప్లై కార్పొరేషన్ – తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన పార్టీ)
APTPC ఛైర్మన్‌ – వజ్జా బాబూరావు (టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ TIDCO ఛైర్మన్ – వేనుములపాటి అజయ్ కుమార్ (జనసేన పార్టీ)

ఈ నామినేటెడ్ పోస్టుల్లో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి దక్కింది. ఆయన మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీచేయాలని భావించారు.. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన పార్టీకి వెళ్లింది. అయినా సరే ఆయన కూటమి గెలుపు కోసం పనిచేశారు.. అందుకే నామినేటెడ్ పోస్టుల్లో ఆర్టీసీ ఛైర్మన్ పదవి దక్కింది. ఆయన టీడీపీలో సీనియర్ నేత కావడంతో కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.

About amaravatinews

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *