ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలో డబ్బుల జమ, కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ను కాలేజీల బ్యాంకు‌ అకౌంట్‌లకు నేరుగా బదిలీ చేసే పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.‘చాలామంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశాలపై నన్ను ట్యాగ్ చేసి స్పందించమని అడిగారు. విద్యార్థులు ప్రస్తావించిన అంశాలను నేను నోట్ చేసుకున్నాను. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.3,500 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తాం. అలాగే సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాల జారీలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కాలేజీలతో కలిసి పనిచేస్తుంది. ఏపీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నాం. విద్యార్థులకు మా పూర్తి సహకారం, మద్దతు ఎప్పుడూ ఉంటుంది’ అని లోకేష్ ట్వీట్ చేశారు.

2019కు ముందు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీల యజమాన్యాలకు జమ చేసే పద్ధతి అమల్లో ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బుల్ని విద్యార్థుల తల్లులల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేసే విధానాన్ని అమలు చేశారు. ఈ డబ్బులు తల్లుల ఖాతాలకు జమ కావడంతో.. కాలేజీల యాజమాన్యాలు కొంత గడువు ఇచ్చి ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడంతో ఇబ్బందిపడ్డారు. కొంతమంది విద్యార్థులు ఫీజులు సకాలంలో కట్టలేక పరీక్షలు కూడా రాయలేకపోయారు. అంతేకాదు విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు కలిపి రూ.3,500 కోట్లకుపైగా బకాయిలు ఉంచారు. ఈ పరిణామాలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మళ్లీ ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు కాలేజీల అకౌంట్‌లకు జమ చేయనుంది.

About amaravatinews

Check Also

ప్రాణాలు తీస్తున్న ట్రావెల్స్ బస్సులు.. రెప్పపాటులో ఘోరం.. ఆటోలో వెళ్తుండగా..

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు అడ్డదిడ్డంగా బస్సులు నడుపుతూ ఎక్కడి పడితే అక్కడ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.. గమ్యస్థానాలకు తొందరగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *