ఏపీలో మందుబాబులకు పండగ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, ప్రభుత్వం చాలా తక్కువకే!

AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ నేటి నుంచి అమల్లోకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రతి షాపు నుంచి వారం రోజులకు సరిపడా మద్యం నిల్వల కోసం లైసెన్సులు దక్కించుకున్నవారు ఏపీఎస్‌బీసీఎల్‌కు ఆర్డర్లు పెట్టారు. ఈ మద్యం విలువ దాదాపు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు. మద్యం షాపులకు లిక్కర్ ఆర్డర్ల కోసం ఎక్సైజ్‌ శాఖ లైసెన్సులు దక్కినవారికి ప్రత్యేకంగా లాగిన్‌ ఐడీలు కేటాయించింది.

నేటి నుంచి మందుబాబులు కోరుకునే అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయి. షాపుల లైసెన్సులు దక్కించుకున్నవారు ఆర్డర్లు పెట్టిన రకాలను ఏపీఎస్‌బీసీఎల్ సరఫరా చేయనుంది. దేశవ్యాప్తంగా లభించే అన్ని బ్రాండ్లను వారం రోజుల్లో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. అయితే రూ.99కే క్వార్టర్‌ మద్యం విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే నాలుగు నేషనల్‌ కంపెనీలు ఆ ధరలో అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ మద్యం కూడా రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తుందంటున్నారు.

మరోవైపు ప్రభుత్వం మద్యంపై కొత్తగా డ్రగ్‌ కంట్రోల్‌ సెస్‌ విధించింది. ల్యాండెడ్‌ కాస్ట్‌పై సెస్ 2 శాతం మేర వేయనుంది. దీనిద్వారా ఏడాదికి రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సెస్ ద్వారా వచ్చే డబ్బుల్ని డ్రగ్స్, గంజాయి, ఇతర వ్యసనాల నుంచి విముక్తి.. కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ కోసం వెచ్చిస్తారు. అలాగే కొంత డబ్బులు యాంటీ నార్కొటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌కు కూడా కేటాయిస్తారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

నూతన మద్యం పాలసీలో ప్రభుత్వం రూ. 99కే క్వార్టర్‌ బాటిల్‌ మద్యం అందజేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ అమలులో ధరల సవరణకు కేబినెట్ ఆమోదం కావాలి.. అలాగే కొన్ని మద్యం కంపెనీలు రూ.99కే క్వార్టర్ మద్యం అందించేందుకు ఒప్పుకోగా.. మరికొన్ని కంపెనీలు ఆమోదం తెలపాల్సి ఉంది. అందుకే రెండు, మూడు రోజుల్లో రూ.99కే మద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఆయా కంపెనీలకు సంబంధించిన సరుకు ఇప్పటికే లిక్కరు డిపోలకు చేరుకున్న సంగతి తెలిసిందే. వీటిలో ఎంసీ విస్కీ, ఐవీ, రాయల్‌స్టాగ్‌, రాయల్‌గ్రీన్‌లతో పాటు కింగ్‌ఫిషర్‌, 100 పైపర్స్‌ వంటి బీర్లతో పాటూ మరికొన్ని ఉన్నాయి. ఈ బ్రాండ్‌లన్నీ మద్యం షాపుల్లో అందుబాటులోకి వస్తాయి.

About amaravatinews

Check Also

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్

సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *