ఏపీకి కొత్త టెన్షన్.. మరో తుఫాన్ ముప్పు, బీ అలర్ట్!

ఏపీని వర్షాలు ముంచెత్తాయి.. వాయుగుండం ప్రభావంతో మూడు రోజుల వర్షానికే జనజీవనం స్తంభించింది. వర్షాలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్న సమయంలో వాతావరణశాఖ మరో బాంబ్ పేల్చింది. ఈ నెల 6 ,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. అది తుఫాన్‌గా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనంపై పక్కాగా క్లారిటీ వస్తుంది అంటున్నారు. వాయుగుండం నుంచి తేరుకోక ముందే మళ్లీ తుఫాన్ టెన్షన్ మొదలైంది.

తెలుగు రాష్ట్రాలు అతి భారీ వర్షాలతో భారీగా నష్టపోయాయి. ఏపీలో విజయవాడను వరద ముంచెత్తింది.. గతంలో ఎప్పుడూ లేని విధంగా వానలు పడ్డాయి. నగరం మొత్తం వరద గుప్పిట్లో చిక్కుకుంది.. విజయవాడ, గుంటూరుపై ప్రభావం ఎక్కువగా ఉంది.. ఈ వరద ముప్పు తొలగలేదు. అటు రైల్వే ట్రాక్‌లు కూడా దెబ్బ తిన్నాయి.. వందలాది రైళ్లు రద్దయ్యాయి. జాతీయ రహదారుల మీద వరద ప్రవహిస్తోంది.. దీంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో మరో తుఫాన్ ముప్పు అంటూ అంచనాలతో టెన్షన్ పెంచుతోంది.

మరోవైపు విజయవాడలో వరద బాధితుల్ని రక్షించే పనిలో ఉంది ప్రభుత్వం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. తమిళనాడు నుంచి 3, పంజాబ్ నుంచి 4, ఒడిశా నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో వారు రంగంలోకి దిగారు.. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరో 4 హెలికాప్టర్లు విజయవాడకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్లకోసం రంగంలోకి దిగనున్నాయి. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని.. ప్రజలు భయాందళోనకు గురికావొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.

ప్రకాశం బ్యారేజీకి వరద కొసాగుతోంది.. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 11.38 లక్షల క్యూసెక్కుల నీరును కిందకు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతున్నారు.. మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌ దగ్గర 24.3 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది.. దీంతో వరద ఉద్ధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపేశారు. అలాగేఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతికి కొట్టుకొని వచ్చిన మూడు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. ఈ బోట్లుగేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారాయి.. ఈ బోట్లు తగలడంతో బ్యారేజీలో ఓ పిల్లర్‌ పాక్షికంగా దెబ్బతింది.

About amaravatinews

Check Also

లా అండ్ ఆర్డర్‌ విషయంలో ఇష్టారాజ్యంగా ఉంటే తొక్కి నార తీస్తాః డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆరు నెలలు అయింది.. హనీమూన్ ముగిసింది.. ఇప్పటికీ మేలుకోకపోతే మేటర్ సీరియస్సే.. అంటూ అధికారుల సీటు కింద హీటు పెంచేశారు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *