సమంత వల్లే నాగ చైతన్య-శోభిత జాతకం చెప్పాను: వేణుస్వామి

సెలబ్రెటీలు, రాజకీయ నేతల జాతకాలను సోషల్ మీడియాలో చెబుతూ ఫేమస్ అయ్యారు వేణుస్వామి. అయితే జగన్ విషయంలో ఆయన చెప్పిన జోస్యం ఫలించకపోవడంతో ఇక సెలబ్రెటీల జాతకాలు చెప్పనంటూ ఆయన రెండు నెలల క్రితం మాటిచ్చారు. కానీ రీసెంట్‌గా అక్కినేని నాగ చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు వేణుస్వామి. వీరి పెళ్లి జీవితంపై తన విశ్లేషణన పోస్ట్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్లు కూడా వేణుస్వామిపై మండిపడ్డారు. మాట తప్పిన వేణుస్వామి అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ విషయంపై వివరణ ఇస్తూ ఓ వీడియోను ఆయన షేర్ చేశారు.

సమంత కోసమే చెప్పాను

“మూడు రోజుల క్రితం నాగ చైతన్య-శోభిత ధూళిపాళ జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద తీవ్రమైన డిబేట్‌లు అవి సాగుతున్నాయి. అయితే నేను ఆ జాతకాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు నేను సమంత నాగ చైతన్యల జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి కంటిన్యూగా ఈ జాతకాన్ని కూడా విశ్లేషించాను. అంతే తప్ప సెలబ్రెటీల జాతకాలు చెప్పను అని నేను ఇచ్చిన మాట తప్పలేదు. నేను ఇక మీదట సెలబ్రెటీల జాతకాలు చెప్పడం మానశానని ఇంతకుముందే చెప్పాను.. దానికి కట్టుబడి ఉన్నాను. సెలబ్రెటీల జాతకాలు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ చేయను అని నేను రెండు నెలల క్రితం చెప్పిన మాట పైనే ఉన్నాను. అయితే సమంత-నాగ చైతన్యల జాతకాన్ని చెప్పాను కనుక దానికి పొడిగింపుగా మాత్రమే ఇప్పుడు చైతన్య-శోభితల జాతకం చెప్పాను.” అంటూ వేణుస్వామి అన్నారు.

ఇక ఈ విషయం గురించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా తనతో మాట్లాడారని వేణుస్వామి అన్నారు. “ఇప్పుడే మంచు విష్ణు నాతో ఫోన్‌లో మాట్లాడారు. నేను వారికి కూడా ఇదే క్లారిటీ ఇచ్చాను. నేను ఎందుకు చైతన్య-శోభిత జాతకం చెప్పాల్సి వచ్చిందనే వివరణ ఇచ్చాను. అలానే ఇక మీదట సెలబ్రెటీలు, రాజకీయ నేతల జాతకాలు చెప్పను అని మంచు విష్ణుకి కూడా చెప్పాను. దీంతో ఆయన కూడా గుడ్ డెసిషన్ అన్నారు. కనుక నేను ఇక మీదట సెలబ్రెటీల జాతకాలు చెప్పను. ఇలాంటి చెప్పాలంటూ నా దగ్గరికి ఎవరూ రావద్దు” అంటూ వేణుస్వామి అన్నారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేణుస్వామి ఈసారైనా మాట మీద నిలబడతారా అంటూ నెటిజన్లు కొశ్చన్ చేస్తున్నారు. ఇక నాగ చైతన్య-శోభిత వైవాహిక జీవితం 2027 వరకూ బాగానే ఉంటుందని ఆ తర్వాత మాత్రం గొడవలు జరుగాతయంటూ వేణుస్వామి చెప్పిన సంగతి తెలిసిందే.

About amaravatinews

Check Also

రజాకార్ సినిమాను తప్పకుండా చూడాలన్న బండి సంజయ్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

తెలంగాణ చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం రజాకార్. యాటా సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమాలో అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *