Kadam

తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. 21 డిమాండ్లతో నోటీస్

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. 21 డిమాండ్లతో సమ్మె నోటీస్‌ ఇచ్చారు కార్మికులు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయకపోవడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ట్రేడ్‌ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్మికులు. 2021 నుంచి వేతన సవరణ హామీలు నెరవేర్చాలని కోరారు. ఆర్టీసీని ప్రయివేట్‌ పరం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు కార్మికసంఘాల నేతలు. అద్దె …

Read More »

ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు.. ఎక్కడెక్కడ ఎంతంటే.?

ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిచేయాలని నిర్ణయించింది. మార్పుల కారణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచబోతున్నట్టు స్పష్టం చేశారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌. రిజిస్ట్రేషన్‌ బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్‌ రేట్లు నిర్ణయిస్తామన్నారు. గ్రోత్ కారిడార్లు, భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 20శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరుగుతాయన్నారు మంత్రి అనగాని. గత వైసీపీ పాలనలో రిజిస్ట్రేషన్‌ విలువల సవరణలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించలేదన్నారు. కొన్ని చోట్ల …

Read More »

వైఎస్ జగన్ మార్గంలో అస్సాం సీఎం.. ఇంతకీ ఏ విషయంలోనంటే.?

ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దన్నగా ఉన్న అస్సాం తాజాగా మరో 3 రాజధానుల ప్రస్తావనతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఆ రాష్ట్రానికి దిస్‌పూర్ (గువాహటిలో ఒక భాగం) రాష్ట్ర రాజధానిగా ఉంది. ఇది రాష్ట్రానికి పశ్చిమాన ఒక మూలన బ్రహ్మపుత్ర నదికి, హిమాలయ పర్వత సానువులకు మధ్యన విస్తరించి ఉంటుంది.అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నారు. హిమాలయాలు, బ్రహ్మపుత్ర నదీ లోయ మధ్య సువిశాలంగా విస్తరించిన అస్సాం రాష్ట్రానికి దిబ్రూగఢ్‌ను రెండవ రాజధానిని చేస్తానని …

Read More »

గద్దర్‌ను హత్య చేశారు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

ప్రజా నౌక గద్దర్‌ది ముమ్మాటికి హత్య చేశారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. దీన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. గద్దర్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గద్దర్‌పై అనుచితంగా మాట్లాడితే సహించేది లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫైరయ్యారు.కిలారి ఆనంద్ పాల్.. షార్ట్‌గా కే ఏ పాల్. ఈ పేరు చెపితే తెలియని వారుండరు అనేంతలా పాతుకుపోయిన వ్యక్తి. నిత్యం ఏదో ఒక సంచలన కామెంట్స్‌తో మీడియా దృష్టిని ఆకర్షిస్తూ …

Read More »

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. తిరుపతన్నకు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

తెలంగాణలో అత్యంత సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు అరెస్ట్‌లు, దర్యాప్తులు, విచారణల తర్వాత- ఈ కేసులో ఫస్ట్‌ బెయిల్‌ వచ్చింది. మాజీ ఏఎస్పీ తిరుపతన్నకు బెయిల్‌ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది.. కాగా.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మొత్తం నలుగురు అరెస్టయ్యారు.తెలంగాణలో అత్యంత సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు అరెస్ట్‌లు, దర్యాప్తులు, విచారణల తర్వాత- ఈ కేసులో ఫస్ట్‌ బెయిల్‌ వచ్చింది. మాజీ ఏఎస్పీ తిరుపతన్నకు …

Read More »

అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ రిలీఫ్

సుప్రీం కోర్టులో ఏపీ మాజీ సీఎం జగన్‌కు ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. బెయిల్‌ రద్దుకు సహేతుకమైన కారణాలు లేవని, అలాంటప్పుడు రద్దు అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ లేదని స్పష్టం చేసింది.వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ మరో ధర్మాసనానికి బదిలీ, ఆయన బెయిల్‌ రద్దు చేయాలన్న ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు పిటిషన్లపై సుప్రీంకోర్టులో …

Read More »

కిడ్నీ రాకెట్‌ అల్లాటప్పా కాదు.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు

కిడ్నీ రాకెట్‌లో అలకనంద ఆస్పత్రి వెనుక అంతులేని రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. లోకల్ గా ఏదో చోటా మోటా కేసుగా ముందు భావించినా..దీ నివెనుక భారీ కిడ్నీ రాకెట్ దాగుందని పోలీసులు అనుమానం. ఆస్పత్రి ముసుగులో ఓ భారీ కిడ్నీ దందాకు ఆముఠా తెరలేపినట్లు స్పష్టమవుతోంది. దొరికింది కొందరే. కానీ దొరకాల్సింది చాలా ఉందని పోలీసుల మాటల్లో అర్థమవుతోంది.తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఎల్బీనగర్ వేదికగా అలకనంద హాస్పిటల్‌లో గుట్టుగా సాగుతున్న కిడ్నీ మార్పిడి రాకెట్ …

Read More »

బైక్‌పై బ్యాగుతో అనుమానాస్పదంగా యువకుడు.. ఆపి తనిఖీ చేయగా..

ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా పండించిన గంజాయిని అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకునేవారు మన పోలీసులు. కానీ తాజాగా ఫారెన్ నుంచి గంజాయి మన ప్రాంతానికి వస్తుంది. అవును.. ఏకంగా అమెరికా నుంచి దిగుమతి అయిన గంజాయిని.. హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…హైటెక్స్ సిటీలో ఫారిన్ గంజాయి గుప్పుమన్నది. కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పెడ్లర్లుగా మారారు. తమకున్న సాఫ్ట్‌వేర్ తెలివితో ఏకంగా విదేశాలకు చెందిన గంజాయిని తీసుకువచ్చి తోటి ఉద్యోగులకు విక్రయిస్తున్నారు. అయితే వారి ఆటకట్టించారు పోలీసులు. హైదరాబాద్‌ గచ్చిబౌలి …

Read More »

ఓర్నాయనో.. ఒక్కో కిడ్నీ రూ.55లక్షలు.. ఇడ్లీలా మాదిరే అమ్మేశారు.. సంచలన విషయాలు..

తీగ లాగితే డొంక కదులుతోంది. కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రత్యేక టీంతో కేసును స్పీడప్ చేశారు పోలీసులు. కిడ్నీ రాకెట్ దందా ఏపీకి చెందిన ప్రధాన నిందితుడి కనుసన్నల్లో జరిగినట్లు గుర్తించారు. అతడి కోసం వేట కొనసాగిస్తున్నారు హైదరాబాద్‌ పోలీసులు.. అంతేకాకుండా.. మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.హైదరాబాద్ కిడ్నీ రాకెట్‌ కేసులో సంచలన విషయాలు నమోదవుతున్నాయి. సరూర్‌నగర్‌లోని అలకనంద ఆసుపత్రిపై ఆకస్మిక దాడి చేసిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ముఠాలో కీలకంగా వ్యవహరించి పరారీలో ఉన్న ఇద్దరు …

Read More »

బాలయ్యకు పద్మభూషణ్.. ఇంటి కెళ్లి అభినందనలు తెలిపిన కిషన్ రెడ్డి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ కళాతమల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారం దక్కింది. దీంతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ నందమూరి హీరోకు అభినందనలు తెలియజేస్తున్నారు.సినీ నటులు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డ్‌ రావడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. హైదరాబాద్‌లో బాలకృష్ణ ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. వివిధ రంగాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డ్‌ ప్రకటించిన కేంద్రానికి …

Read More »