తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డు జారీ పథకాలను గణతంత్ర దినోత్సవం నాడు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.. అయితే.. ఈ నాలుగు పథకాలు జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఒక్కో గ్రామంలో ఇవ్వాల్టి (జనవరి 27) నుంచి అమలుకానున్నాయి.. అయితే.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు రైతులు, రైతు కూలీలు ఖాతాల్లో జమ కాబోతున్నాయి. మండలానికో గ్రామం చొప్పున మొత్తం 606 గ్రామాల్లో రైతు భరోసా …
Read More »తిరుపతి ఘటనతో TTD అలెర్ట్.. మినీ బ్రహ్మోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు..
తిరుమలలో ఫిబ్రవరి 4న రథ సప్తమి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మినీ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఏర్పాట్లపై సమీక్షించేందుకు టీటీడీ బోర్డు జనవరి 31న అత్యవసరంగా సమావేశంకానుంది.తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ అలెర్ట్) అయ్యింది. రథ సప్తమి సందర్భంగా ఫిబ్రవరి 4న ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు …
Read More »మీరు మీ తల్లిదండ్రులకు ఏకైక కూతురా? అయితే ఈ స్కాలర్‌షిప్ మీకోసమే
పదో తరగతి పూర్తి చేసిన బాలికలకు సీబీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా కలిగిన బాలికా విద్యార్ధినులకు ప్రతియేటా మాదిరిగానే ఈ సారి కూడా సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్ అందించేందుకు ముందుకొచ్చింది. పదో తరగతి పాసై 11వ లేదా 12వ తరగతిలో ప్రవేశాలు పొందిన విద్యార్ధినులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు..తల్లిదండ్రులకు ఒకే ఒక సంతానంగా కలిగి ప్రతిభ కలిగిన బాలికలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) బోర్డు యేటా సింగిల్ గర్ల్ …
Read More »జన సైనికులకు పవన్ బహిరంగ లేఖ.. అలా చేయొద్దంటూ వినతి
జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి జనసేన వారు ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయొద్దని పవన్ కోరారు. ప్రతీ ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడవాల్సిన …
Read More »డీపీఆర్‌ఓ అభ్యర్థులకు అలర్ట్.. ధ్రువపత్రాల పరిశీలన తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).. డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (డీపీఆర్‌ఓ) పోస్టులకు సంబంధించి కీలక అప్ డేట్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఇప్పటికే రాత పరీక్ష పూర్తి కాగా మెరిట్ లిస్ట్ కూడా వెల్లడించింది. ఈ పోస్టలకు ఎంపికైన అభ్యర్ధులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించే తేదీని ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (డీపీఆర్‌ఓ) పోస్టులకు సంబంధించి ఇప్పటికే రాత పరీక్ష పూర్తైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెరిట్ లిస్ట్ విడుదల చేయగా… …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడకు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఒక బహుమతి ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చిన తన ప్రియ మిత్రుడు బిల్‌గేట్స్‌కు ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈమేరకు బిల్‌గేట్స్‌పై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇది ఒక అంతర్‌దృష్టి పూర్వక, ప్రేరణాత్మక పఠనం అవుతుందన్నారు. బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ తనకు తన ‘సోర్స్ కోడ్’ బుక్ బహుమతిగా ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వలలో చిక్కిన మరో యువకుడు.. కలకలం సృష్టిస్తున్న సూసైడ్ నోట్!
ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఇంట్లో ఒక్కరి వ్యసనం.. మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతుంది. తాజాగా నంద్యాల జిల్లాలో బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. ఈక్రమంలోనే సదరు యువకుడు రాసిన సూసైడ్ లెటర్ కలకలం రేపుతుంది. కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది ఘటన.బెట్టింగ్ కాదది..బ్లాక్‌హోల్..! లోపలికి వెళ్లడమే తప్ప..బయటకు రావడమన్నదే ఉండదక్కడ. వందలు, వేలతో మొదలైన మాయాజూదం..చూస్తుండగానే లక్షలకు చేరుతోంది. ఆపై అప్పుల ఊబిలో చిక్కుకుని.. జేబులు గుల్లవుతాయి. అత్యాశతో కొందరు.. వ్యసనాల బారిన పడి మరికొందరు..ఆన్‌లైన్ …
Read More »మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం.. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి
కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సోదరి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కేసీఆర్ కలత చెందారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఇంటికి కేసీఆర్‌తో సహా ఇతర కుటుంబసభ్యులు వెళ్లారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన ఐదో సోదరి చీటీ సకలమ్మ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు దాదాపు 85 వరకు ఉంటుందని సమాచారం. సికింద్రాబాద్ యశోద …
Read More »కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు షాక్.. మేయర్ సహా 10 మంది కార్పోరేటర్లు రాజీనామా
కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కి బిగ్‌షాక్ తగిలింది. బీఆర్‌ఎస్‌కి కరీంనగర్ మేయర్ సునీల్‌రావు రాజీనామా చేశారు. శనివారం బీజేపీలో చేరనున్నారు మేయర్ సునీల్‌రావు. మేయర్‌తోపాటు మరో 10మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు సైతం బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. బండి సంజయ్ సమక్షంలో వీళ్లంతా బీజేపీ గూటికి చేరబోతున్నారు బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ మేయర్ సునీల్‌రావు. BRSలో అవినీతిని భరించలేకే పార్టీ వీడుతున్నట్టు చెప్పారు. రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ.. ఇతర పనుల్లో అవినీతి జరిగిందని..ఆ అవినీతి నేత పేరును త్వరలోనే వెల్లడిస్తానన్నారు. బీఆర్‌ఎస్ నేతల అవినీతి చిట్టా …
Read More »శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆ రోజున ప్రివిలేజ్ దర్శనాలు పలు సేవలు రద్దు
ఫిబ్రవరి 04న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్ర వారం అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.వచ్చే నెల 4న తిరుమలలో జరగనున్న శ్రీవారి రథసప్తమి వేడుకకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని రథసప్తమి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. …
Read More »