Kadam

గోవా నుంచి వికారాబాద్ వచ్చిన ట్రైన్.. ఓ భోగీలో తనిఖీలు చేయగా

కొత్త సంవత్సరం వేడుకలకు సమయం దగ్గరపడుతోంది.. ముందుగానే ఏర్పాట్లు షురూ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో గ్రాండ్‌గా ఈవెంట్స్ నిర్వహణ జరుగనుంది. ఈవెంట్స్, సెలబ్రేషన్స్ సంగతి అలా ఉంటే.. ఇటు పోలీసులు సైతం అలెర్ట్ అయ్యారు. అక్రమ మద్యం రవాణాపై నిఘా పెంచారు.వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా గోవా మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ మద్యం తీసుకువచ్చినట్లు గుర్తించార. వాస్కోడిగామా ట్రైన్‌లో 95 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన కొందరు యువకులు కొత్త ఏడాది …

Read More »

డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే.. అన్ని పార్టీల నుంచి పెరుగుతున్న డిమాండ్!

భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల..పార్టీలకు అతీతంగా రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్‌ సింగ్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్‌ సింగ్‌ను దేశం గుర్తుంచుకుంటుందని కొనియాడుతున్నారు. మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచికంగా 7 రోజులు సంతాప దినాలుగా పాటిస్తోంది.దేశ ఆర్థిక ప్రగతిని పట్టాలెక్కించిన మాజీ ప్రధాని, ప్రముఖ‌ ఆర్థిక‌వేత్త మన్మోహన్‌ సింగ్‌ …

Read More »

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

హైదరాబాద్‌లో ఇటీవల సోషల్ మీడియాలో ‘ట్రాఫిక్ చలాన్ల పై భారీ డిస్కౌంట్’ అనే పేరు మీద ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ ఫేక్ వార్త ప్రకారం, ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నట్లు వైరల్ చేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా ఫేక్ వార్తగా తేల్చేసారు. గతంలో ఈ తరహాలో డిస్కౌంట్‌లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈసారి వైరల్ …

Read More »

2025 సంవత్సరం ప్రభుత్వ సెలవుల వివరాలు క్లియర్‌గా…

2025కి సంబంధించి హాలిడేస్ లిస్ట్‌ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. ఇందులో 27 సాధారణ సెలవులను ప్రకటించగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. కాగా ఆప్షనల్ సెలవు తీసుకోవడానికి, ఉద్యోగులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. వారి సూపర్‌వైజర్ నుంచి అనుమతి పొందాలి.మరో 3 రోజుల్లో 2024 సంవత్సరం ముగిసిపోతుంది. 2025లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టేందుకు అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా 2025లో పండగల సెలవులపై కూడా క్లారిటీ వచ్చింది.  2025 సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఆప్షనల్ సెలవుల లిస్ట్‌ను తెలంగాణ సర్కార్ తాజాగా రిలీజ్ చేసింది. …

Read More »

ఫార్ములా ఈ-రేసు కేసు విచారణలో కీలక పరిణామం.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు..!

గత BRS ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్మూలా E కార్‌ రేస్‌లో నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది తెలంగాణ ఏసీబీ. అప్పటి మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా చేర్చింది. అలాగే ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ను ఏ2గా, HMDA మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ బిఎల్‌ఎన్‌ రెడ్డిని A3గా చేర్చింది ఏసీబీ.ఫార్ములా ఈ-రేసు కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు(KTR) ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు …

Read More »

కలుపు తీస్తోన్న గిరిజనుడిపైకి దూసుకువచ్చి చుట్టేసిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత

పొలంలో పనులు చేస్తున్న జన్ని రాము అనే గిరిజనుడిపై కింగ్ కోబ్రా అకస్మాత్తుగా దాడి చేసింది. సుమారు పది అడుగుల పొడవుతో భయానకంగా ఉన్న కింగ్ కోబ్రా పెద్ద పెద్దగా బుసలుకొడుతూ జన్ని రాముపై దాడి చేయడంతో ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ భయాందోళనకు గురయ్యాడు. పొలం పనిలో నిమగ్నమైన గిరిజనుడికి ఎదురైన ఈ ఘటన స్థానికులను సైతం గగుర్పాటుకు గురి చేసింది.జన్ని రాము ప్రతిరోజు పొలం పనులకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఎప్పటిలాగే రాము ఉదయాన్నే జీడి మామిడి తోటకెళ్లి …

Read More »

హనీట్రాప్‌ కేసులో సంచలన ట్విస్ట్‌.. ఈసారి బయటకొచ్చిన NRI బాధితులు..!

విశాఖ హనీట్రాప్‌ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జాయ్‌ జెమీమాకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై స్పెషల్‌ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌లో ముగ్గురిని అరెస్ట్‌ చేసి విశాఖకు తరలించిన పోలీసులు.. ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలని సూచించారు. మరోవైపు నిందితుల అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.సంచలనాలకు కేరాఫ్‌గా మారింది విశాఖ హనీట్రాప్‌ కేసు. రోజుకో అప్‌డేట్‌.. పూటకో ట్విస్ట్‌తో పక్కా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న క్రైమ్‌ కథా చిత్రంగా తయారైంది. ఆ మధ్య జమీమాకు మాజీ ఎంపీ హర్షకుమార్‌ మద్దతు ఇవ్వడం.. …

Read More »

సాగు చేస్తున్న పొలంలోనే ఉరి వేసుకున్న రైతు కుటుంబం.. కన్నీరు పెట్టిస్తున్న నలుగురి మృతి!

అప్పుల భారం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో జరిగిందీ విషాదం. 15 ఎకరాలు కౌలుకు తీసుకున్న రైతు, 8 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేశాడు. అయితే అప్పుల బాధ తాళలేక పొలం దగ్గరే ఉరివేసుకుని రైతు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రైతన్న కంట కన్నీరు ఆగడం లేదు.. ఎక్కడో ఒకచోట ఏదో ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటూనే …

Read More »

సామాన్యులకు ఇది కదా కావాల్సింది.. రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజధాని అమరావతిలో భూముల ధరలు బాగా పెరిగాయి. రియల్ ఎస్టేట్‌కు బూమ్ వచ్చింది. మరి సామాన్యులకు గుడ్ న్యూస్ అందించేలా.. అక్కడ భూముల రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..ఏపీలో ఆరునెలల కిందట టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక్కసారిగా బెలూన్‌కు గాలి ఊదినట్లుగా.. ఏపీలో రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్లిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఇలా ఒక్కసారిగా గాలి కొడితే బెలూన్లు పేలిపోయినట్లు రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగి పడిపోతుంది …

Read More »

హ్యాట్సాఫ్.. మహిళా ఎస్సై..! మృతదేహాన్ని భుజాన వేసుకుని..!

విశాఖపట్నం మహిళ ఎస్ఐ మానవత్వం చాటుకున్నారు. విధి నిర్వహణలో అధికారి అన్న విషయం మరిచిపోయారు. రైల్వే ట్రాక్ వద్ద ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పంచనామా నిర్వహించిన పోలీసలు, మృతదేహాన్ని మార్చురీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ప్రాంతానికి వాహనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో తానే స్వయంగా మృతదేహాన్ని భుజాన మోస్తూ తీసుకెళ్లారు ఎస్ఐ సూర్యకళ.అది విశాఖ గాజువాక ప్రాంతం.. జగ్గయ్యపాలెం రైల్వే క్యాబిన్ కు సమీపంలో ఓ డెడ్ బాడీ..! దాదాపు 30 ఏళ్ల వయసు ఉంటుంది. సమాచారం …

Read More »