మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్.. ముగ్గురి నేపథ్యాలు వేర్వేరు. కానీ ఈ ముగ్గురికీ పరిచయాలు ఏర్పడింది బీబీపేట్ లోనే. ఇక్కడి నుంచి ప్రారంభమైన వీరి పరిచయాల పర్వం చివరకు పెద్ద చెరువులో ముగ్గురి మృతదేహాలు తేలేవరకు వెళ్లింది. గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరి డెడ్ బాడీలు బయటకు రావడం, వీరి శరీరాలపై బలమైన గాయాలు ఉండటం.. చెరువు గట్టుపై వీరి వస్తువులన్నీ ఉండటం.. అసలింతకీ ఇవి హత్యలా? ఆత్మహత్యలా? అనే డైలమాలో పడేశాయి..ఒకే సమయంలో.. ఒకేచోట.. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ఒక …
Read More »వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ.. వదిన ఆస్తి కోసమే కుట్ర! ఆ రెండో చెక్క పెట్టె ఎవరి కోసమో?
మహిళ ఇంటికి డెడ్ బాడీ హోం డెలివరీ చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిని వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో శ్రీధర్ వర్మతోపాటు అతని రెండో భార్య, ప్రియురాలు హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వదిన తులసి ఆస్తి కాజేసేందుకు ఆమెను బెదిరించడానికే పర్లయ్యను హతమార్చినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు..పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో పార్శిల్‌లో మృతదేహం కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. వదిన తులసిని బెదిరించి, ఆమె ఆస్తిని కాజేసేందుకు శ్రీధర్ …
Read More »ఏంటీ..! బాబోయ్.. ఆముదంతో ఇన్ని ప్రయోజనాలా ఉన్నాయా..?
ఆముదం అంటే ఈ జనరేషన్ వాళ్లు ముఖాలు అదోలా పెడతారు కానీ… దీన్ని వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మీ ఇళ్లలో ముసలివాళ్లను అడిగితే దీని బెనిఫిట్స్ ఏంటో చెబుతారని అంటున్నారు. ముఖంపై ముడతలు, చర్మం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలకు ఆముదంతో చెక్ పెట్టవచ్చట..ఆముదాన్ని సంప్రదాయ వైద్య విధానంలో విరివిగా ఉపయోగిస్తారు. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉంటారు. చర్మ సంబంధిత సమస్యలు, జుత్తు సంబంధిత సమస్యలు, జీర్ణాశయ సమస్యలు వంటి …
Read More »అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు! మరో 4 రోజులు మరింత చలి
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో చలిగాలులు మరికాస్త తీవ్రతరం కానున్నట్లు తెలిపింది..ఏపీ వాసులకు వాతావరణ కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. అల్పపీడనంగా బలహీనపడిందని వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన …
Read More »కొరడాతో దెబ్బలు కొట్టుకున్న అన్నామలై..
తమిళనాడులో మరోసారి శపథ రాజకీయాలు మొదలయ్యాయి. ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శపథం చేశారు. DMKను పదవి నుంచి దించే వరకు చెప్పులు వేసుకోనని ప్రకటించారు. DMK ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ తనకు తాను కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. అన్నా యూనివర్శిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనకు నిరసనగా ఆయన ఆందోళన చేపట్టారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి….తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరు కొరడా దెబ్బలు …
Read More »ఇకపై డిగ్రీ థర్డ్ ఇయర్‌లో లాంగ్వేజ్ సబ్జెక్టులుండవ్.. అన్నీ కోర్ సబ్జెక్టులే
తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యావిధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా థర్డ్ ఇయర్‌లో లాంగ్వేజెస్‌కు స్వస్థి చెప్పేందుకు సిద్ధమైంది. థర్డ్ ఇయర్‌లో కేవలం కోర్ సబ్జెక్టులకే పరిమితం చేయనుంది. ఇందుకోసం డిగ్రీ మూడో సంవత్సరంలో లాంగ్వేజెస్‌ను పూర్తిగా తొలగించింది. దీంతో ఇకపై డిగ్రీ ఫస్ట్, సెకండియర్‌లోనే ల్యాంగ్వేజ్ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది కూడా. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. నిజానికి ఇదేమీ కొత్త విధానం కాదు. …
Read More »గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు లైన్‌క్లియర్.. ఆ ఏడు పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చేపట్టిన పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. రిజర్వేషన్ల అంశం తేలేవరకు మెయిన్స్ పరీక్షల ఫలితాలు ప్రకటించవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీజీఎస్‌పీఎస్సీ)ను ఆదేశించాలన్న విజ్ఞప్తిని సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే పిటిషన్ల దాఖలు ఆలస్యం కావడాన్ని తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన జీవో 29 అప్‌లోడ్ కాలేదన్న కారణాన్ని తోసిపుచ్చింది. ప్రిలిమ్స్ …
Read More »ఏటా ఆలస్యంగా ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్.. ఏడాది ముగుస్తున్నా కొలిక్కిరాని ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యేటా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్య మవుతుండటంపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా విద్యా సంవత్సరం ముగుస్తున్న ఇంకా ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తి కాలేదు. దీంతో విద్యార్ధులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్ ప్రక్రియ మరింత ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో విద్యా సంవత్సరం ముగింపు వరకు ప్రవేశాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఫలితంగా తరగతులు ఆలస్యంగా మొదలై చివరన …
Read More »మన్మోహన్ సింగ్ తన పాలనలో తెలుగు రాష్ట్రాలపై చెరగని సంతకం.. శోకసంద్రంలో తెలుగువారు
మన్మోహన్ సింగ్ మృతితో తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగాయి. మన్మోహన్ సింగ్ తన పాలనలో తెలుగు రాష్ట్రాలపై చెరగని సంతకం చేశారు. ప్రతిష్టాత్మక పనికి ఆహార పథకాన్ని అనంతపురం వేదికగా ప్రారంభించారు. మరోవైపు మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.మన్మోహన్ సింగ్‌కు తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ప్రధానిగా పేదలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. పేదలు పస్తులు ఉండొద్దన్న ఉద్దేశంతో పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించారు. అనంతపురంలో …
Read More »ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
దేశ ప్రధానిగా, ఆర్ధిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్ గా ఎన్నో కీలక పదవుల్లో విశిష్టమైన సేవలు అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు..ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ …
Read More »