2025-26 విద్య సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ దేశంలోనే అతిపెద్ద రైళ్ల తయారుదారు సంస్థ అయిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితోపాటు ITI పాసైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ పాసైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ.. 2025-26 విద్య సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల …
Read More »సీనియర్లు ఉన్నా అశోక్ గజపతి రాజు వైపే మొగ్గు.. గవర్నర్ పదవి దక్కడానికి కారణం అదేనా..
ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ.. గవర్నర్ పదవికి అశోక్ గజపతిరాజు వైపే మొగ్గు చూపింది అధిష్టానం.. సీనియర్లు ఎంతమంది ఉన్నా అశోక్ గజపతి రాజుకి గవర్నర్ పదవి దక్కడం పై పాలిటిక్స్ లో సర్వత్రా చర్చ నడుస్తోంది. అశోక్ గజపతి రాజు వైపు ఎన్డీఏ ప్రభుత్వం మొగ్గు చూపడానికి కారణాలేంటి? అసలు అశోక్ గజపతిరాజు ఎవరు?.. అంటే అశోక్ గజపతి రాజు భారతదేశ సంస్థానాల్లోనే అత్యంత గౌరవం పొందిన గజపతిరాజుల సంస్థాన వారసులు. అశోక్ గజపతి తండ్రి …
Read More »ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..! ఇద్దరు సీఎంలతో కేంద్రం భేటీ..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కేంద్రానికి చేరింది. గోదావరి, కృష్ణా నదుల జలాల పంపకం, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జల వివాదానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల జల జగడం ఢిల్లీకి చేరింది. ఏపీ, తెలంగాణ సీఎంలతో భేటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈసారైనా గోదావరి, కృష్ణా జలాల లెక్కలు తేలేనా? బనకచర్ల భవిష్యత్ ఎలా ఉండబోతుంది? బేసిన్లు, భేషజాలకు …
Read More »నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఏపీపీఎస్సీ
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవలే మెగా డీఎస్సీని నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అటవీ శాఖలో 691 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కల. ప్రభుత్వం జాబ్ కోసం కొందరు ఎన్నో ఏళ్లు కష్టపడుతుంటారు. ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కానీ ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీపై తాత్సారం చేస్తుంటాయి. ఇక ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే మెగా డీఎస్సీని …
Read More »ఆమె ఉరిశిక్షను అడ్డుకోవడం కష్టమే.. సుప్రీంకోర్టుకు కేంద్రం ప్రభుత్వం వెల్లడి!
వ్యాపార భాగస్వామిని హత్య చేసిందన్న ఆరోపణలతో యెమెన్ దేశం కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు ఊరిశిక్షి పడిన విషయం తెలిసిందే.. మరో 48 గంటల్లో ఆమెకు ఉరిశిక్షను అమలు చేయనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆమె ఉరిశిక్షను ఆపేందుకు ఎలాంటి మార్గాలు లేవని సుప్రీంకోర్టుకు తెలిపింది. భారత్-యెమెన్‌ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేనందున ఉరిశిక్షను ఆపేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అనుకూల మార్గాలు లేవని భారత అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. మరో 48 గంటల్లో ఉరిశిక్ష …
Read More »ఓరి తిరుమలరావు..! మాములు కంత్రీవి కాదు నువ్వు.. సర్వేయర్ హత్య కేసులో కొత్త విషయాలు
జోగులాంబ గద్వాల్‌లో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ఒక్కొక్కటిగా మిస్టరీలు బహిర్గతమవుతున్నాయి. వాయిస్ చేంజర్‌తో హత్య కుట్రను అమలు చేసిన తిరుమల్–ఐశ్వర్యల పై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. “నన్నెందుకు చంపుతున్నారన్నా…” అంటూ వేడుకున్నా తేజేశ్వర్‌ను సుఫారీ గ్యాంగ్ అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు వెల్లడైంది. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితులు దొరికారు. వారిని రిమాండ్‌కు తరలించారు. కానీ హత్య కుట్రలో అనేక మిస్టరీలు, చిక్కుముడులు అలానే ఉండిపోయాయి. అయితే నిందితుల కస్టోడియల్ విచారణలో అనేక ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు జోగులాంబ …
Read More »అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియా సీఈవో సంచలన కామెంట్స్..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల కలలను చిదిమేసింది. దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా నిలిచిన ఈ దుర్ఘటనలో 250మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదం జరిగి నెల దాటింది. దీనికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వార్త చర్చకు వస్తూనే ఉంది. ఇటీవలే విమానానికి ఇంధనం అందకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఏఏఐబీ 15 పేజీలతో ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ఇంధన కంట్రోల్ స్వీచ్‌లు ఆఫ్ అయ్యాయని.. పైలట్లు సైతం ఇదే విషయంపై …
Read More »గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు. హర్యానా గవర్నర్‌గా ఆషిం కుమార్ గోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతి భవన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది . గోవా గవర్నర్‌గా ఏపీకి చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు. అలానే హర్యానా గవర్నర్‌గా ఆషిం కుమార్ గోష్.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాలను రాష్ట్రపతి నియమించారు. ఈ మేరకు తాజాగా గవర్నర్ల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ …
Read More »తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న ట్రైన్‌లో చెలరేగిన మంటలు..రెండు బోగీలు దగ్ధం!
తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రాయలసీమ నుంచి షిరిడి వేళ్లే ఎక్స్‌ప్రెస్‌ట్రైన్ లూప్‌లైన్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్తా రెండు బోగీలకు వ్యాపించడంతో ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ సమీపంలోని పాశమైలారంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా అగ్నిప్రమాదం జరిగి …
Read More »కుమార్తె పెళ్లికి అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించిన జగ్గారెడ్డి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో జరగబోతోంది. ఈ వేడుక ఆగస్టు 7న సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కుమార్తె పెళ్లి పత్రిక అందజేశారు. తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషిస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంట పెళ్లి సందడి సన్నాహాలు మొదలయ్యాయి. ఆయన కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో ఆగస్టు 7న సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. …
Read More »