పోలవరం పనులు ఇక పరుగులు పెట్టిస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వారం వారం ప్రతి సోమవారం పోలవరం పనులను సమీక్షిస్తూ.. జెట్ స్పీడ్‌లో ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం పనుల్లో వేగం పెంచింది. నిర్దిష్ట కాలపరిమితితో ప్రణాళికలు రూపొందించి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటివరకు …
Read More »ఇచ్చిన మాటకు కట్టుబడి మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆరు నెలలలోపే నేరవేర్చుకున్నారు. పిఠాపురంలో 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. …
Read More »తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఏ తేదీన ఏ పరీక్ష ఉంటుందంటే..
తెలంగాణ ఇంగర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్ష షెడ్యూల్ సోమవారం (డిసెంబర్ 16) విడుదలైంది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు …
Read More »ఫోన్ కోసం అన్నదమ్ముల మధ్య లొల్లి.. అన్న సూసైడ్! తల్లడిల్లిన కన్నోళ్లు
చిన్న చిన్న కారణాలకే పిల్లలు పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుని కన్నోళ్లకు కడుకుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఓ ఇంట అన్నదమ్ములు ఫోన్ విషయమై గొడవపడ్డారు. దీంతో తండ్రి కలుగ జేసుకుని మందలించాడు. అంతే.. అవేశంతో కొడుకు ఇంట్లోకెళ్లి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు..నేటి కాలంలో పిల్లలు, యువత ఫోన్‌లకు అడిక్ట్ అయిపోతున్నారు. కాసేపు కూడా ఫోన్ వదలలేని స్థితికి వస్తున్నారు. నిద్రలేచింది మొదలు.. రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకూ చేతిలో ఫోన్ ఉండాల్సిందే. పొరబాటున ఎవరైనా ఫోన్ లాక్కుంటే వారిపై దాడికి తెగబడటం.. లేదంటే తమను …
Read More »కీరదోసకాయ మాత్రమే కాదు.. దాని గింజలతో బోలేడు లాభాలు..!
కీర దోసకాయ లాభాలు మనందరికీ తెలిసిందే. అయితే, కీర దోసకాయ గింజలు కూడా అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. హై బీపీ నుంచి డయాబెటిస్ వరకు అన్నింటికీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. దోసకాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం..దోసకాయలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ …
Read More »బోడ కాకర కాయతో బోలెడు లాభాలు..తెలిస్తే బోరు అనకుండా తింటారు..!
బీడు భూములు, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. ముఖ్యంగా జూన్-జులై మాసాల్లో మొలకెత్తి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇక వీటి ధర చికెన్, మటన్ ధరతో పోటీ పడుతుందని చెప్పాలి. అలాంటి బోడ కాకరకాయ లాభాలు తప్పక తెలుసుకోవాల్సిందే..బోడ కాకర..ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయింది. కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకున్నారు. ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలు తీసుకోవటం అలవాటు చేసుకుంటున్నారు. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటున్నారు. వాటితో పాటు సేంద్రీయ ఉత్పత్తులు …
Read More »డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువులు.. ఎంపికైతే నెలకు రూ.40 వేల జీతం
ముంబైలోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్… దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. …
Read More »కొరుకుడుపడని కొయ్యగా మారిన దేశ రాజధాని.. ఈసారైనా కమలనాథుల కల నెరవేరేనా..?
భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మూడు దశాబ్దాలుగా అధికారం ఆ పార్టీకి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కలిసి పోటీ చేసినా సరే క్లీన్ స్వీప్ చేసిన కమలదళం అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి చతికిలపడుతోంది. చివరిసారిగా 1993లో గెలుపొందిన ఆ పార్టీ, మళ్లీ ఇప్పటి వరకు అధికారం చేజిక్కించుకోలేకపోయింది. మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా …
Read More »రోడ్డు ప్రమాదంతో గాయపడి మృతి చెందిన గోవును చూసి, ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది.. ఎందుకో తెలుసా?
రోడ్డు ప్రమాదంతో చనిపోయిన గోవును చూసి గ్రామం మొత్తం చలించిపోయింది. మృతదేహానికి సంప్రదాయబద్ధంగా ఊరంతా కలిసి ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.సొంత వాళ్లు చనిపోతే కూడా పట్టించుకోని ఈ రోజుల్లో.. రోడ్డు మీద వదిలేస్తున్న చాలా మందిని చూస్తున్నాం. నిత్యం తమ కళ్ళ ముందు తిరిగాడే మూగ జీవి రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందింది. ఆ మూగ జీవికి మనుషుల మాదిరిగా గ్రామస్తులు ఘనంగా అంత్యక్రియలు చేశారు. సంప్రదాయబద్ధంగా దానికి ఊరంతా కలిసి ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లిలోని …
Read More »హైదరాబాద్ గజగజ.. ఆరేళ్ల తర్వాత మళ్లీ విజృంభిస్తున్న చలిపులి!
ఆరేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ లో చలి పులి విజృంభిస్తుంది. ఓ వైపు చలితో జనాలు అల్లాడిపోతుంటే.. మరోవైపు నానాటికీ పడిపోతున్న గాలినాణ్యత డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దీంతో జనజీవనం ప్రశ్నార్ధకంగా మారింది. ఆదివారం సిటీలో దాదాపు 300 AQI నమైదైంది. సోమవారం మధ్యాహ్నం నాటికి గాలి నాణ్యత కాస్త కోలుకుంది..హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్పపీడన ప్రభావంతో ఉదయం, రాత్రి వేళల్లో చలిపంజా విసురుతోంది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతంగా కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలితీవ్ర వల్ల …
Read More »