Kadam

వామ్మో.! గడ్డకట్టించే చలి.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు..

తెలుగు రాష్ట్రాలనూ మంచు ముంచేస్తోంది. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. అటు దట్టమైన మంచుతో వాహనాలు, విమానాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగ మంచు కురుస్తోంది. పొగమంచుతో విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లే విమానాలు ఆలస్యం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఇక మంచు ఎక్కువగా ఉండటంతో విమానాల రాకపోకలకు సైతం ఆటంకం కలుగుతోంది. ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు …

Read More »

చలికాలంలో మీ కళ్లు జర జాగ్రత్త.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అలర్టవ్వండి..

చలికాలంలో అనేక కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీకు కళ్లలో నొప్పి, కళ్లు ఎర్రబడడం, నీరు కారడం లేదా తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు లాంటివి కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కొన్ని కంటి జబ్బుల లక్షణం కావచ్చు. లక్షణాలను సకాలంలో గుర్తించడం, చికిత్స చేయడం ద్వారా, ఏదైనా తీవ్రమైన కంటి వ్యాధిని సులభంగా నివారించవచ్చు. శీతాకాలంలో ఏ కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. వాటిని ఎలా నివారించాలో నిపుణుల నుంచి తెలుసుకుందాం.. …

Read More »

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఆ ఇబ్బందులు ఉండవు..!

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో జీఎంఆర్ గ్రూప్ కీలక ప్రకటన చేసింది. ఎయిర్‌పోర్టులో రెండో టెర్మినల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇది ప్రయాణికుల రద్దీని త‌గ్గించ‌డంలో ఉప‌యోగప‌డనుంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రతి ఏడాదికి 3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ఈ సంఖ్య 4.5 కోట్లకు చేరుకున్న తర్వాత కొత్త టెర్మినల్‌ను జీఎంఆర్ గ్రూప్ పూర్తిగా వినియోగంలోకి తీసుకురానుంది .ఇప్ప‌టికే ఎఐతో ప‌ని చేసే ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్‌ను (APOC) కేంద్ర పౌర విమానయాన శాఖ …

Read More »

అప్పుడు ఖమ్మం.. ఇప్పుడు లగచర్ల.. రైతుకు బేడీలపై వేడెక్కిన రాజకీయం.. జైలర్ సస్పెండ్..

లగచర్ల రైతుకు సంకేళ్ల ఇష్యూలో రేవంత్‌ సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది..బీఆర్ఎస్‌ పార్టీ. అన్నంపెట్టే రైతు చేతికి బేడీలు వేస్తారా..? అంటూ మండిపడుతోంది. దీంతో హస్తం నేతలు ఏడేళ్లు వెనక్కి వెళ్లి ఖమ్మం ఇష్యూను తెరమీదకు తెస్తున్నారు. ఇంతకూ లగచర్య ఇష్యూకు.. ఖమ్మం ఘటనకు సంబంధం ఏంటి..? లగచర్ల Vs ఖమ్మం ఘటనలో వాస్తవాలేంటి..?చల్లబడిదనుకున్న లగచర్ల ఇష్యూ మరోసారి వేడెక్కింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ తోపాటు అధికారులపై దాడి కేసులో నిందితుడు, రైతు హీర్యా నాయక్‌ను సంగారెడ్డి జైలు నుంచి సంకెళ్లతో …

Read More »

‘ప్రార్థనా స్థలాల్లో సర్వే చేపట్టరాదు..’ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయరాదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా స్థలాల చట్టంపై రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కింది కోర్టులు కూడా ప్రార్థనా స్థలాల్లో సర్వేకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశం లోని అన్ని ప్రార్థనా స్థలాల్లో వెంటనే సర్వేలు నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆలయాలు , మసీదుల్లో సర్వేపై ఎలాంటి కొత్త …

Read More »

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఎందుకంటే..

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిసి సీఎం.. ఇవాళ మరికొందరిని భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు విజ్ఞప్తులు చేయనున్నారు. అటు ఏఐసీసీ పెద్దలతో సీఎం సమావేశం తర్వాత.. మంత్రి వర్గ విస్తరణపై కీలక అప్‌డేట్ రానుంది.ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి బిజీబిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ జరగనుంది. మరోవైపు రాష్ట్రంలో పలుప్రాజెక్టుల కోసం నిధుల మంజూరు చేయాలంటూ …

Read More »

చూడటానికి తియ్యటి చాక్లెట్స్‌లా ఉన్నాయి.. ఓపెన్ చేసి చూస్తే గుండె ధడేల్..!

చూడటానికి తియ్యటి చాక్లెట్స్ లాగే ఉంటాయి.. రంగుల కాగితం చుట్టి, చూస్తే తినాలి అనిపించేంత అందంగా ఉంటాయి. కానీ, అవి బయట షాపుల్లో దొరికే చిన్న పిల్లలు తినే చాక్లెట్లు అనుకుంటే మీరు పొరబడినట్లే.. అచ్చంగా గంజాయి చాక్లెట్లు.. ఏకంగా 4 కేజీల, 957 గ్రాముల గాంజా చాక్లెట్స్ సీజ్ చేసి, అవి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం రైడ్స్ చేపట్టింది. ఇందులో భాగంగా గాంజా చాక్లెట్స్ విక్రయిస్తున్న వీరేంద్ర పాండే …

Read More »

ఇదెక్కడి దరిద్రంరా నాయనా.. బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లి..

హైదరాబాద్‌ ఉప్పల్‌ ప్రాంతంలోని భరత్‌ నగర్‌లో ఇటీవల కాలంలో చెప్పులు, షూలు మాయమవుతున్న ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. అయితే, చెప్పులు, షూలు మాయమవ్వడం సాధారణ దొంగతనంగా భావించిన స్థానికులు.. కొంతకాలానికి దీని వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుసుకున్నారు. చెప్పులు, షూలు, స్లిప్పర్లను చోరీ చేస్తూ.. అవి విక్రయించడానికి ఓ దంపతులు వినూత్న పద్ధతిని ఉపయోగించారు. వారి ఇంటిని చెప్పుల గోడౌన్‌గా మార్చి, భారీగా దొంగతనాలకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనకు గురిచేశారు. బుధవారం, స్థానిక వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి …

Read More »

అబద్దాల మోహన్‌ బాబు.. మీడియానే కాదు పోలీసులపై కూడా విమర్శలు.. ఆ రోజు అసలేం జరిగిందంటే..

మీడియాపై తాను చేసిన దాడి గురించి నటుడు మోహన్‌బాబు వివరణ ఇస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. దానిలో తను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అబద్ధాల కవరింగ్‌తో, తన నటనా చాతుర్యపు కలరింగ్‌తో…. వాస్తవాలకు మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్‌బాబు… అసలు ఆరోజు ఏం జరిగిందో మొత్తం గమనించగలరు..హైదరాబాద్‌ శివార్లలోని జల్‌పల్లి వేదికగా…నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోంది. మోహన్‌బాబు, ఆయన పెద్దకొడుకు విష్ణు ఓవైపు, చిన్న కుమారుడు మంచు మనోజ్‌ మరోవైపు …

Read More »

ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో పెద్దఎత్తున గంజాయి పట్టుబడింది. కొట్టెక్కి చెక్‌పోస్ట్‌ నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్‌ చేశారు. అందులోని 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో గంజాయి ఉందని అనుమానంతో ఒరిస్సా నుంచి ట్రాక్ చేసి లారీని కొట్టెక్కి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు పోలీసులు. లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొన్నామన్నారు. లారీ, రెండు బొలెరో వాహనాలు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఖాకీలు కేసు నమోదు చేసి దర్యాప్తు …

Read More »