నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట.. ఇది మన పెద్దలు చెప్పేమాట. వారి కాలంలో ఏ పరిస్థితిని చూసి పెద్దలు ఈ సామెత చెప్పారో తెలియదు కానీ.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. విశాఖపట్నంలో జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యం. అసలు నిజం తెలియకముందే.. అబద్ధం ఊరంతా చుట్టి వచ్చింది. తీరా పోలీసులు అసలు వాస్తవాలు వెల్లడించిన తర్వాత.. అందరూ ఔరా అనుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలో బుధవారం జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. …
Read More »బెండకాయను తింటే ఏమౌతుందో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండకాయలలోని పీచు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది డయాబెటిస్ నివారణకు మంచిది. బెండకాయల్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణని నెమ్మదిస్తుంది.మంచి ఆరోగ్యానికి పండ్లు, కూరగాయాలు మంచి పౌష్టికాహారం అని అందరికీ తెలిసిందే..! అయితే, కూరగాయల్లో ముఖ్యంగా బెండకాయ కూర, ఫ్రై అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. బెండకాయల్ని ఫ్రై, సాంబారు, పులుసు కూరల్లో ఎక్కువగా వాడతారు. అయితే, బెండకాయలు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయనేది మీకు తెలుసా..? బెండకాయ …
Read More »దిశా ఎన్‌కౌంటర్‌కు 5 ఏండ్లు.. పాపం! వారికి ఇంకా తప్పని తిప్పలు..
తెలంగాణలో సంచలనం రేపిన దిశ ఘటన ఇప్పటికి ఎవరు ఇంకా మర్చిపోలేదు. 2019 నవంబర్ 27న అత్యంత దారుణంగా వెటర్నరీ డాక్టర్‌ను నిందితులు గ్యాంగ్ రేప్ చేశారు. సరిగ్గా పది రోజుల తర్వాత నిందితులను పోలీసులు ఇదే రోజున ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్‌ను సవాల్ చేస్తూ అనేక పిటిషన్లు అటు సుప్రీంకోర్టులను ఇటు హైకోర్టులోను ఫైల్ చేశారు. సుప్రీంకోర్టు గతంలో సిర్పుర్కర్ కమిషన్‌ను నియమించింది. సిర్పుర్కర్ కమిషన్ తన …
Read More »ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా విద్యార్ధి బ్యాగ్.. ఏముందాని చెక్ చేయగా షాకింగ్ సీన్
ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్ధి ఎయిర్ పోర్టులో అనుమానా స్పదంగా కనిపించాడు. అతడి లగేజీ చెక్ చేయగా.. రెండు బుల్లెట్లు బయటపడ్డాయి. ఈ ఘటన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో వెలుగు చూసింది. వెంటే సిబ్బంది సదరు విద్యార్ధిని అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారు. గన్నవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని పానిపట్‌కు చెందిన ఆర్య యువకుడు గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్వస్థలం నుంచి గత జులై నెలలో యూనివర్సిటీకి …
Read More »గ్రామ సమస్యలు తీర్చిన మహిళా సర్పంచ్‌కే పెద్ద కష్టం.. ఏకంగా ఇంట్లో నుంచి గెంటేసిన కుటుంబ సభ్యులు!
రోడ్డున పడ్డారు ఓ మహిళా సర్పంచ్. ఆమె గ్రామానికి ప్రధమ పౌరురాలు… గ్రామంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే ఆ మహిళా సర్పంచ్.. అయితేనేం.. ఓ మహిళగా సొంత కుటుంబ సభ్యుల నుంచి సమస్య ఎదురయింది. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళా సర్పంచ్‌ను.. భర్త తరపు కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ అమానుష ఘటన శ్రీసత్య సాయి జిల్లాలో వెలుగు చూసింది. లేపాక్షి మండలం సిరివరం సర్పంచ్ నేత్రావతిని భర్త తరపు కుటుంబ సభ్యులే ఇంట్లో నుంచి …
Read More »వామ్మో.. కొత్త రకం సైబర్ నేరాల లిస్ట్ ఇది.. అలెర్ట్‌గా లేరంటే అంతే సంగతులు
రోజుకో కొత్త రకం నేరాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒకరకంగా నమ్మించి వారి బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా ఖాళీ చేసేస్తున్నారు. ఈ విషయాల పట్ల సరైన అవగాహన లేకపోవడంతో బాగా చదవుకున్న వారు కూడా సైబర్ నేరగాళ్ల బుట్టలో పడి లక్షలు, కోట్లు కోల్పోతున్నారు. దీనికి సంబంధించి నిత్యం వార్తా కథనాలను మనం చూస్తూనే ఉన్నాం.. ట్రాయ్‌తో పాటు పోలీసులు సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆన్‌లైన్ వేదికగా పలు అవగాహన కార్యక్రమాలను సైతం చేపడుతోంది. మరి ప్రస్తుతం ట్రెండింగ్‌లో …
Read More »పుష్ప 2 సినిమాకి.. తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధం ఏంటి?
పుష్ప అంటే వైల్డ్ ఫైర్ కావచ్చు.. కానీ అందుకు కారణం.. గంగమ్మ జాతర! పుష్ప రైజ్ నుంచి రూల్ వరకు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ వందల ఏళ్లకు ముందే.. దుష్టుల పాలిట ఊచకోతకు సంకేతం గంగమ్మ జాతర..! తాజాగా ఐకాన్ స్టార్ తాజా గెటప్‌తో.. వాల్డ్ ఫేమస్ అయింది తిరుపతి గంగమ్మ జాతర! అవును..పుష్ప- 2 స్టోరీ లైన్ ఏదైనా కానివ్వండి..! కానీ సినిమాను ఊపేసింది మాత్రం..గంగమ్మ జాతర సన్నివేశాలు! మాతంగి వస్త్రధారణలో 20 నిమిషాలపాటు థియేటర్లలో పూనకాలు పుట్టించాడు పుష్పరాజ్! శక్తి …
Read More »కాలం తీరిన మందులిచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డాక్టర్లు.. గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్న యువకుడు..
హైదరాబాద్ పాతబస్తీలో అపెండిక్స్ ఆపరేషన్ కోసం ఆస్పత్రిలో సర్ఫరాజ్ అనే యువకుడు చేరాడు. ఆ యువకుడికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు కాలం చెల్లిన సెలైన్‌తో పాటు ఇంజెక్షన్లు, మందులు ఇచ్చారు. దీంతో యువకుడి ఆరోగ్యం క్షీణించింది. రోజు రోజుకి ఆ యువకుడి ఆరోగ్యం చేయిదాటిపోవడంతో కుటుంబ సభ్యులకు వైద్యులపై పలు అనుమానాలు వచ్చాయి. మందులపై దృష్టిపెట్టగా 9 నెలల క్రితమే కాలం చెల్లిన మందులు ఇచ్చినట్టు తేలింది. దీంతో ఆధారాలతో సహా మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ …
Read More »వడ్డీ రేట్లు యధాతథం.. రెపోరేటు 6.50 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన గవర్నర్ శక్తికాంత దాస్
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్వహించింది. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయని ఆర్‌బీఐ, రెపోరేటు 6.50 శాతంగా కొనసాగిస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వసారి.దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగించిన నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని 4.50 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా …
Read More »పెన్షన్ ఇస్తామని నమ్మించారు.. చివరికి వృద్ధులను ఇలా చేశారు..!
అన్‌నోన్ కాల్ ఎత్తారో అడ్డంగా బుక్కైపోతారు. అవతలివారి మాటలు నమ్మారో నిండా మునిగిపోతారు. మాటలతో బెదిరిస్తారు సైబర్ బూచోళ్లు. ఎకౌంట్లో క్యాష్ పడేదాకా టార్చర్ పెడతారు. చదువుకున్నోళ్లు, ఉద్యోగులు కూడా మోసగాళ్ల బారినపడుతున్నారు. కొత్త టెక్నిక్స్‌తో జనాన్ని ట్రాప్ చేస్తున్నారు.. మోసాల్లో ముదిరిపోయిన సైబర్ క్రిమినల్స్. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త నేరంతో పోలీసులకు సవాలు విసురుతున్నారు. తాజాగా వృద్ధులకు వచ్చే పెన్షన్లను సైతం కాజేసేందుకు సిద్ధమవుతున్నారు. రీసెంట్‌గా చాలామంది వృద్ధులు అనవసర లింకులను క్లిక్ చేసి తమ ఖాతాల్లోని డబ్బులు పోగొట్టుకున్నారు. పెన్షన్ …
Read More »