Kadam

చెవులకే కాదు.. మెదడుకూ ప్రమాదమే..! హెడ్‌ ఫోన్స్‌ తో జాగ్రత్త.. మీ అలవాటును మార్చుకోలేదో అంతే సంగతి..!

హెడ్‌ ఫోన్స్ వాడకుండా ఉండటం చాలా మందికి కష్టం. కానీ ఎక్కువ సౌండ్‌ తో పాటలు వినడం లేదా కాల్స్‌ లో మాట్లాడటం కేవలం చెవులకే కాదు.. మెదడు, నరాల వ్యవస్థకు కూడా హానికరం. ఈ అలవాట్ల వల్ల శరీరంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ లు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయ్యాయి. రోజూ పాటలు వినడం, వీడియోలు చూడటం లేదా కాల్ మాట్లాడేటప్పుడు హెడ్‌ ఫోన్‌ లు వాడటం అందరిలోనూ మామూలే అయిపోయింది. …

Read More »

ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. ఆ వ్యాధులకు తిరుగులేని దివ్యౌషధం.. దెబ్బకు ఛూమంత్రం వేసినట్లే..

వంటగదిలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, మసాలా దినుసులు ఉంటాయి.. కానీ వాటిలో అత్యంత ప్రత్యేకమైనది కొత్తిమీర.. నాన్‌ వెజ్ అయినా.. పప్పు అయినా, కూర అయినా, రైతా అయినా, చట్నీ అయినా.. కొత్తిమీర ఆకులు ప్రతి ఆహారం రుచి.. వాసనను పెంచి అద్భుతంగా మారుస్తాయి.. ఈ ఆకులు రుచిని పెంచడమే కాకుండా, మన శరీరానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది సాధారణంగా కనిపించే ఒక విషయం కావొచ్చు.. కానీ దానిలో దాగి ఉన్న పోషకాలు మన ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయని …

Read More »

అలర్ట్.. బుధవారం స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు బంద్..? కారణం ఏంటంటే..

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.. దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాలు.. వాటి అనుబంధ సంఘాల ఐక్యవేదిక జూలై 9న (బుధవారం) భారత్ బంద్‌ కు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక.. జాతి వ్యతిరేక విధానాలను అనుసరించడం.. హక్కులను కాలరాయడం.. కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ బంద్ చేపట్టినట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. గత 10 ఏళ్లుగా వార్షిక కార్మిక సమావేశాలు నిర్వహించకుండా …

Read More »

 రూ. 7 లక్షల అప్పు.. నాలుగు రూపాయల వడ్డీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే

మూడేళ్ల క్రితం ఏడు లక్షల అప్పు తీసుకున్నారు. వందకు నాలుగు రూపాయల వడ్డీ చొప్పున చెల్లిస్తూ వచ్చారు. కొంతకాలం తర్వాత వడ్డీ కట్టలేకపోయారు. దీంతో వడ్డీ వ్యాపారి జులుం చూపించాడు. వడ్డీ కట్టకుంటే ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధించాడు. కొద్దీ రోజుల తర్వాత ఇంటికి తాళం వేశాడు. వ్యాపారి వేధింపులు తాళలేక బాధితులు గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. పాత గుంటూరుకు చెందిన అంకమ్మ అనే మహిళ తోపుడు బండిపై ఉల్లిపాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు గోపి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2022లో …

Read More »

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం.. 3 రోజులు వీఐపీ దర్శనాలు రద్దు

ఇంద్రకీలాద్రి పై అట్టహాసంగా శాకంభరి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ప్రత్యేక పూజలతో ప్రారంభం అయిన ఈ ఉత్సవాలు ఎల్లుండితో ముగియనున్నాయి… మూడు రోజులపాటు అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పళ్ళతో అలంకరించనున్నారు.. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గ కొలువైన ఇంద్రకీలాద్రిలో అంగరంగ వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ మొదటి రోజు కావడంతో కేవలం దాతలు ఇచ్చినటువంటి కూరగాయలు ఆకుకూరలు పళ్ళతోనే అలంకారం చేశారు ఆలయ అధికారులు. ఇవాల్టి అలంకరణకు దాదాపు …

Read More »

శ్రీవారి భక్తులకు ఓ మంచి కబురు.. టీటీడీ మరో కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి వైభవాన్ని చాటి చెప్పడంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణకు టిటిడి పుస్తక ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారి భక్తులకు ఇకపై పుస్తక ప్రసాదం చేయనుంది. మతమార్పిడిలను సమూలంగా అరికట్టి సనాతన ధర్మాన్ని చాటి చెప్పేలా టీటీడీ చర్యలు చేపట్టింది. సనాతన ధర్మ వైభవం, విశిష్టతపై అవగాహన కలిగించేందుకు పుస్తక ప్రసాదం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచనలతో పుస్తక ప్రసాదం కార్యక్రమాన్ని విసృత్తంగా చేపట్టబోతోంది హిందూ ధర్మ ప్రచార పరిషత్. దళిత వాడలు, మారుమూల కుగ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో …

Read More »

డిప్యూటీ సీఎం పవన్‌పై అభ్యంతకర పోస్టులు.. ఆమెపై కేసు నమోదు..

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వైసీపీ సమన్వయకర్త కృపాలక్ష్మిపై కేసు నమోదయిది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులపై జనసేన ఫిర్యాదులు చేసింది. మాజీ సీఎం జగన్, పవన్ కళ్యాణ్ ఫోటోలతో అసభ్యకర కామెంట్ కోడ్ చేస్తూ చేసిన పోస్ట్ కలకలం రేపింది. నెల్లూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా పోస్టులపై జనసేన కేడర్ ఫిర్యాదు చేసింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల్లోని పీఎస్‌ల్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు …

Read More »

 ‘మతి, తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా..’ దేవుడికి రోహిత్ లేఖ రాసి మరి..

ఈ లోకం వదిలిపెట్టి వెళ్తున్నా.. దేవుడా. ఇలా ఎందుకు చేసావు.. మానసిక ఒత్తిడితో ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విషాదాన్ని నింపింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..  ఓసారి లుక్కేయండి. ఆశలన్నీ ఆవిరి అయ్యాయంటూ సూసైడ్ నోట్ రాసాడు ఓ యువకుడు. ఈ లోకం నాకు అన్యాయం చేసింది.. అందుకే బతుకలేకాపోతున్నా.. దేవుడు దగ్గరికి వెళ్తున్నానని.. సుసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విషాదం నెలకొంది. …

Read More »

మల్లారెడ్డి విద్యార్థుల సత్తా.. అమెజాన్‌లో భారీ ప్యాకేజీతో కొలువులు!

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో నగరానికి చెందిన ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్ధునులు భారీ ప్యాకేజీతో కొలువులు సొంతం చేసుకున్నారు. ఏడాదికి ఏకంగా రూ.46 లక్షల ప్యాకేజీతో ఇంజనీరింగ్‌ చివరి ఏడాది చదువుతుండగానే ఆఫర్‌ వచ్చింది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌ శివారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలో ఉండగానే భారీ వేతన ప్యాకేజీతో ప్రఖ్యాత ఐటీ సంస్థ అమెజాన్‌లో కొలువులు సొంతం చేసుకున్నారు. సీఎస్‌ఈ చివరి ఏడాది చదువుతున్న శృతి, శ్రీశ్రావ్యలు ఈ …

Read More »

మై హోమ్ ఇండస్ట్రీస్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్.. ఏ రంగంలో అవార్డు వచ్చిందంటే..?

కస్టమర్లకు నాణ్యమైన సిమెంటును అందిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న మహా సిమెంట్‌కు అవార్డుల పంట పండుతుంది. సున్నపురాయి గనుల నిర్వహణలో జాతీయస్థాయిలో మహా సిమెంట్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను దక్కించుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కంపెనీ ఎండీ జూపల్లి రంజిత్ రావు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు ఈ అవార్డులను అందుకున్నారు. సిమెంట్ రంగంలో రారాజుగా నిలుస్తోంది మహా సిమెంట్. సిమెంట్ తయారీలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు మై హోమ్ ఇండస్ట్రీస్‌కు అవార్డులు వస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట …

Read More »