Kadam

పాకీజా దీన స్థితికి చలించిన పవన్ కల్యాణ్.. నటికి తక్షణ సాయం.. ఎంతంటే?

ఒకప్పుడు పాకీజాగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటి వాసుకి ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. తనను ఆదుకోవాలంటూ ఆమె ఇటీవల ఒక వీడియోను రిలీజ్ చేశారు. నటి దీన స్థితిని చూసి చలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాకీజాకు తక్షణ సాయం ప్రకటించారు.తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపన్న హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవర్ స్టార్ రూ. 2 లక్షల రూపాయలు …

Read More »

మనుషుల ప్రాణాలంటే జగన్‌కు లెక్కలేదు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

జగన్‌కు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదన్నారు సీఎం చంద్రబాబు. తన కారు కింద పడి మనిషి చనిపోయినా రాజకీయం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలతో ఏపీ అభివృద్ధి వెనక్కి వెళ్లిందన్నారు చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. పది లక్షల కోట్ల అప్పులు చేసి జగన్ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు. సీఎంగా 15 ఏళ్ల అనుభవం ఉన్న తనకే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఏడాది సమయం …

Read More »

ఆటగదరా శివ.! ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి.. ఆపై రెండు నెలలకే ఆ ఇద్దరూ..

ఇద్దరి మనసులు కలిశాయి. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే రెండు నెలల క్రితం వారు ఉంటున్న ఇంటి ఓనర్ సహాయ సహకారాలతో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలల క్రితం రమ్యశ్రీకి కూడా నిఖిల్ రెడ్డి చేస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించాడు. తమకు నచ్చినవారితో జీవితం కొనసాగించాలని ప్రేమ వివాహం చేసుకుని.. తమ జీవితాన్ని ఎంతో హాయిగా గడపాలని ఎన్నెన్నో కలలు కన్న ఒక జంట.. వివాహమైన రెండు నెలలకే వారి జీవితాలకు చివరి రోజులు వచ్చేస్తాయని ఊహించలేకపోయారు. ఒకే చోట …

Read More »

సత్యసాయి గ్రామంలో మ్యూజిక్‌ మాస్ట్రో AR రెహమాన్ సందడి.. సాయి సంఫనీ ఆర్కెస్ట్రాపై ప్రశంసల జల్లు!

సత్యసాయి గ్రామంలో నిర్వహించిన సాయి సింఫనీ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని మ్యూజిక్‌ మాస్ట్రో ఏఆర్‌ రెహమాన్ సందర్శించారు. ఇందులో గ్రామీణ, పేద నేపథ్యాల నుంచి వచ్చిన 170 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్వదేశీ ఆర్కెస్ట్రా. రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు..మ్యూజిక్‌ మాస్ట్రో, గ్రామీ, ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించారు. గ్లోబల్ హ్యుమానిటేరియన్, ఆధ్యాత్మికవేత్త మధుసూదన్ సాయి నేతృత్వంలోని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వివిధ మానవతా కార్యక్రమాలను పర్యవేక్షించారు. …

Read More »

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు BV పట్టాభిరామ్‌ కన్నుమూత..!

ప్రఖ్యాత హిప్నాటిస్ట్‌, సైకాలజిస్ట్‌, వ్యక్తిత్వవికాస నిపుణులు డాక్టర్ పట్టాభి రామ్ (75) కన్నుమూశారు. సోమవారం (జూన్ 30) రాత్రి 9.45 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఇంద్రజాలకుడిగా (మెజీషియన్) తన ప్రయాణాన్ని ప్రారంభించి, కెరీర్‌లో అంచలంచెలుగా ఎదిగారు. ఆయన తన జీవితకాలంలో అనేక బెస్ట్ సెల్లింగ్ మోటివేషనల్ పుస్తకాలను రచించారు. యువతకు లెక్కకుమించి మోటివేషన్‌ స్పీచ్‌లు ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్ధులు, యువత కోసం ఆయన అహోరాత్రులు కష్టించారు. సానుకూల ఆలోచనలను రేకెత్తించడానికి, ప్రేరేపించడానికి, జీవిత సవాళ్లను అధిగమించి ఉన్నతంగా ఎదగడం.. వంటి ఎన్నో …

Read More »

దేశంలో మారో రాకెట్‌ లాంచ్‌ సెంటర్‌ ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

ఇస్రో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య గణనీయంగా పెంచుతోంది. గతంలో ఏడాదికి ఒకటి రెండు ప్రయోగాలు మాత్రమే చేసే ఇస్రో ఇప్పుడు నెలకో లాంచ్ చేస్తోంది. ఈ సంఖ్యను మరింత పెంచేందకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటిదాకా రాకెట్ ప్రయోగం అంటే కేవలం శ్రీహరికోట నుంచి మాత్రమే చేపట్టేది. కానీ ఇప్పుడు రాకెట్‌ లాంచ్‌ కోసం సెంటర్‌ను ఇప్రో ఏర్పాటు చేస్తోంది. దీనికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే భారత్‌కు రెండో రాకెట్‌ లాంచ్‌ సెంటర్‌ కూడా అందుబాటులోకి …

Read More »

మంత్రి లోకేష్ మంచి మనసు.. చిన్నారి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.15 లక్షల సాయం!

కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. పుట్టకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి వైద్యసాయం అందించి ప్రాణాలు నిలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపూ నాయుడు అనే చిన్నారి పుట్టకతోనే లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని, ఇందుకు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసే చిన్నారి తండ్రి …

Read More »

పాస్‌పోర్ట్ సేవల్లో కీలక మార్పులు.. పాస్‌పోర్ట్ జారీ మరింత ఈజీ

ఆధునిక కాలంలో ప్రపంచం కుగ్రామంగా మారింది. ఒక దేశం నుంచి మరో దేశానికి రాకపోకలు విపరీతంగా పెరిగాయి. దానికి అనుగుణంగానే వేల సంఖ్యలో విమానాలు నిత్యం వివిధ దేశాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. చదువు, వ్యాపారం, ఉద్యోగం, వివాహం, పర్యటన తదితర కారణాలతో చాలా మంది భారతీయులు విదేశాలకు వెళతున్నారు. ఆ ప్రయాణానికి ముందుగా పాస్ పోర్టు అవసరం.గతంలో పాస్ పోర్టు కావాలంటే నిబంధనల ప్రక్రియ చాాలా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం పాస్ పోర్టు సేవ 2.0 అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు వేగంగా, సులభంగా …

Read More »

ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

ఏపీలోని ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించింది. నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు- ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు) 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పీయూసీ-బీటెక్‌ (రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్) ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధుల నుంచి ఏప్రిల్‌ 27 నుంచి మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం, ఇతర రాష్ట్రాలకు చెందిన …

Read More »

కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు.. కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం

దేశంలోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. అటు రీసెర్చ్ డెవలప్‌మెంట్ & ఇన్నోవేషన్ స్కీమ్‌‌కు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ. 1 లక్ష కోట్లతో కార్పస్ ఫండ్‌తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రీసెర్చ్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించడమే ప్రధాన ఉద్దేశం. అలాగే దీర్ఘకాలిక తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలు అందించనుంది కేంద్రం. అలాగే …

Read More »