Kadam

ఆపరేషన్‌ సిందూర్‌తో భారత ఆయుధాలకు పెరిగిన డిమాండ్.. “ఆకాశ్” క్షిపణి వ్యవస్థతో పాటు “గరుడ” ఫిరంగులపై బ్రెజిల్ ఆసక్తి!

గత కొన్ని దశాబ్దాలుగా రక్షణ పరికరాలు, ఆయుధాల గురించి ప్రస్తావన వస్తే అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలు గురించే చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో ప్రపంచంలోనే జనాభాలో అతిపెద్ద దేశంగా, ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానంలో ఉన్న భారత్ గురించి చెప్పుకుంటున్నారు. అందుకు కారణం పాకిస్థాన్‌లోని ఉగ్రవాదు శక్తులను మట్టికలిపించేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్. ఉన్న స్థలం నుంచే పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తీరుతో..ఈ ఆపరేషన్‌లో భారత్‌ ఉపయోగించిన ఆయుధాలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. ఇదే ఇప్పుడు …

Read More »

ఈ ఏడాది ఇంజినీరింగ్‌ కోర్సులకు ఫీజు పెంపు లేనట్లే..! కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌ విద్యకు పాత ఫీజులనే ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో పాత ఫీజులే ఈ ఏడాదికి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2025-28 ఫీజుల ఖరారు చేసేందుకు త్వరలోనే అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తామని, అప్పటివరకు పాత ఫీజులనే కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్లకోసారి సాధారణంగా ఇంజినీరింగ్‌ కోర్సుల ఫీజులను పెంచడం రివాజుగా వస్తుంది. ఈ ఏడాది ఫీజుల పెంపుపై ఇప్పటికే సీఎం …

Read More »

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. ఆగస్టు 4 నుంచి తరగతులు షురూ!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ జులై 17 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్‌ జరగనుంది. అయితే మొదటి రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక మూడో విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం ఇంజనీరింగ్‌ మొదటి సెమిస్టర్‌ తరగతులు ఆగస్టు …

Read More »

మంచి రోజులొచ్చాయి గురూ.. రికార్డ్‌ ధర పలికిన కోణసీమ కొబ్బరి!

కొనసీమ రైతుల మంచిరోజులొచ్చాయి. అక్కడ పండేకొబ్బరికాయల ధర ఇప్పుడు రికార్డ్‌ స్థాయి రేటు పలుకుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జాతీయ మార్కెట్‌లో వెయ్యి కొనసీమ కొబ్బరి కాయల ధర ఏకంగా 23వేల రూపాయలు పలికింది. దీంతో కోనసీమ కొబ్బరి రైతుల్లో ఆనందోత్సహము నెలకొంది.కోనసీమలో పండించే కొబ్బరికాయలకు ప్రస్తుతం జాతీయ మార్కెట్‌లో రికార్డు ధర పలుకుతోంది. చరిత్రలో మునిపెన్నడు చూడని విధంగా కొబ్బరి ధర పెరిగడంతో కోనసీమ రైతుల్లో ఆనందోత్సహము నెలకొంది. పండించిన పంటకు మద్దతు ధర లభిస్తే.. అన్నదాతల కళ్లలో ఆనందంగాని అవదులే …

Read More »

వామ్మో.. ముఖంపై ఈ 4 సంకేతాలు కనిపిస్తున్నాయా.. మీ గుండె డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే..

ప్రస్తుత కాలంలో గుండె సమస్యలు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, పని ఒత్తిడి ఇవన్నీ కూడా మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. అయితే.. గుండె బలహీనపడి సరిగ్గా పనిచేయనప్పుడు, అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుందని  వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక్కోసారి వైద్య అత్యవసర పరిస్థితికి దారితీయొచ్చు.. లేదా ప్రాణాంతకంగా మారొచ్చు.. గుండె అసలు ఎందుకు బలహీనపడుతుందన్న ప్రశ్న అందరి మదిలో తలెత్తుతుంటుంది.. గుండె బలహీనపడటానికి అనేక …

Read More »

అయ్యో ఘోరం.. 37కి పెరిగిన మృతుల సంఖ్య.. పాపం మరో 27 మంది ఏమయ్యారో ఏంటో..

ఊహించని ప్రమాదం.. ఊహకందని విషాదం. రోజూలాగే పనికి వెళ్లిన కార్మికులను రియాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా సంభవించిన పేలుడుతో అసలేం జరుగుతుందో తెలియని భయంకర పరిస్థితి. షాక్‌ నుంచి తెరుకునేలోపే తీవ్రంగా గాయపడ్డ కార్మికులు ఆర్తనాదాలు.. చనిపోయిన వారి మృతదేహాలతో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో హృదయవిదారకంగా మారిపోయింది.సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 37 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరో 35 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. …

Read More »

బోనమెత్తిన భాగ్యనగరం.. బోనం అంటే ఏమిటి? ప్రాముఖ్యత.. బోనాల జాతర ఎప్పుడు మొదలైందంటే..

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్‌ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి చల్లగా చూడమని కోరుకుంటారు. ఇక ఈ ఏడాది పండుగ రానే వచ్చింది. ఆషాడ మాసం మొదటి గురువారం గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మకు తొలిబోనం సమర్పించడంతో బోనాల సంబురాలు షురూ అయ్యాయి.ఆషాడ మాసం రాకతో తొలకరి జల్లులతో పాటు తెలంగాణలో బోనాల సందడిని తెచ్చింది. మహిళలు …

Read More »

HIV బాధితులకు తెలంగాణ సర్కార్ చేయూత – పెన్షన్లు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం మానవీయ చర్యగా 14,084 మంది కొత్త HIV బాధితులకు చేయూత పెన్షన్లు మంజూరు చేసింది. ఈ పెన్షన్లు జూలై నుంచి అందుబాటులోకి రానున్నాయి. నెలకు రూ.2016 చొప్పున అందే ఈ సాయం, జీవన నాణ్యత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది. కొత్త లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూ.28.40 కోట్లు కేటాయించింది. ఇప్పటికే 34,421 మందికి ఈ పథకం ద్వారా సాయం అందుతోంది.HIV బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మానవీయంగా స్పందించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ …

Read More »

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు ఏకగ్రీవం!

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఏబీవీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మన్నగూడలో జరిగే సన్మాన సభలో రాంచందర్ రావును అధ్యక్షుడిగా సంస్థాగత ఎన్నికల అధికారి శోభ కరండ్లాజే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మన్నేడలో ఏర్పాటు చేసిన స్మాన సభకు భారీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. వీరితో పాటు తెలంగాణ కీలక బీజేపీ నేతలు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ర్యాలీగా కార్యకర్తలతో …

Read More »

సారూ.. జర కనికరించండి.. కలెక్టర్‌ దగ్గరకు ఎనిమిదేళ్ల బాలుడు!.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

సాధారణంగా ఇంట్లో ఒక సమస్య వస్తే ఓ 8 ఏళ్ల బాలుడు ఏం చేస్తాడు. ఈ వయస్సులో నేను ఏం చేయగలనని గమ్మునుంటాడు. పెద్దలు కూడా పసిపిల్లాడు వాడికేం తెలుసు అనుకుంటారు. కానీ ఇక్కడో బాలులు తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యను ధైర్యంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఏకంగా జిల్లా కలెక్టర్‌ చేతనే శభాష్ అనిపించుకున్నాడు. తన ధైర్యంతో మూతబడిన తన తల్లి టిఫిన్ సెంటర్‌ను తెరిపించాడు. ఇంతకు ఆ బాలుడు ఎవరో తెలుసుకుందాం పదండి.ఆ రోజు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే.. ఈ సందర్భంగా …

Read More »