అమరావతి నగర అభివృద్ధిలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే మరో పని చేయాలని నిర్ణయించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజకీయ నాయకుడు, దిగ్గజ నటుడు స్వర్గియ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్మారకంగా భారీ విగ్రహాన్ని నీరుకొండ గ్రామం వద్ద ఏర్పాటు చేయనుంది. ఈ భారీ విగ్రహ నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర …
Read More »సౌదీ గగనతలంలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. 3 యుద్ధ విమానాల ఎస్కార్ట్‌తో అపూర్వ స్వాగతం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నారు. సౌదీలో ప్రధాని మోదీకి ఆపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని విమానానికి రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందిన F15 విమానం భద్రత కల్పించింది. భారతదేశం, సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. సౌదీ అరేబియాను విశ్వసనీయ స్నేహితుడుగా, వ్యూహాత్మక మిత్రదేశంగా ఆయన అభివర్ణించారు. 2019లో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పడినప్పటి నుండి, ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన విస్తరణ …
Read More »వావ్.. వాటే ఐడియా గురూ.. సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
ఈ వేసవిలో కొత్త గ్రీన్ ట్రెండ్ బాగా నడుస్తోంది. వేసవి వేడిని చల్లబరిచేందుకు హైదరాబాద్, విజయవాడలో ఇలాంటి ఓ సరికొత్త ఐడియా జనాలను ఆకర్షిస్తోంది. మొక్కల అద్దె సేవలు! ఇంటిని అందంగా, చల్లగా మార్చే ఈ ట్రెండ్ యువతలో సందడి చేస్తోంది? ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే మొక్కలు మీ ఇంటికి చేరతాయి.. సీజన్ తర్వాత తిరిగి తీసుకెళతారు. ఈ పర్యావరణ హిత ఆలోచన గురించి పూర్తిగా తెలుసుకోండి!మొక్కల అద్దె.. ఒక్క క్లిక్‌తో మీ ఇంటికి మొక్కలు డెలివరీ! Ugaoo, Greenly లాంటి వెబ్‌సైట్లు, స్థానిక …
Read More »ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు ఛాన్స్!
తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలైనాయి. తాజా ఫలితాల్లో ఫస్టియర్ ఫలితాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 66.89 శాతం, ఇంటర్ సెకెండ్ ఇయర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా (77.59 శాతం) టాప్‌లో నిలిచింది. సెకెండ్ స్థానం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్ధులు అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. ఇక ఇంటర్ సెకెండ్ ఇయర్‌లో ఫస్ట్ ములుగు జిల్లా (80.12 శాతం), రెండో స్థానం ఆసిఫాబాద్ …
Read More »‘ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం’.. RSS చీఫ్ భగవత్ సామాజిక ఐక్యతా మంత్రం
అలీఘర్‌లో ఐదు రోజుల పర్యటనలో ఉన్న RSS చీఫ్ మోహన్ భగవత్ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ కుల విభజన నిర్మూలనకు ‘అందరకీ ఒకే ఆలయం, ఒకే బావి, ఒకే శ్మశానం’ అనే సూత్రాన్ని అవలంభించాలని పిలుపునిచ్చారు. తద్వారా సామాజిక ఐక్యత సాధ్యమవుతుందని అన్నారు..హిందూ సమాజంలోని కుల విభజనలను తొలగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం (ఏప్రిల్ 20) ఓ కార్యక్రమంలో అన్నారు. కుల విభజన నిర్మూలనకు ‘అందరకీ ఒకే ఆలయం, ఒకే …
Read More »ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చేశాయ్..
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2025 మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేశారు. హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ బోర్డు అధికారక తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2025 మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలయ్యాయి. నాంపల్లిలోని …
Read More »నేడు వడగండ్ల వానలు, ఈదురు గాలులు.. ఆరంజ్ అలెర్ట్ జారీ!
తెలుగు రాషాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవేసు ద్రోణి ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తుంటే.. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని..ఉత్తర చత్తీస్‌ఘడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మున్నార్ వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో మంగళవారం (ఏప్రిల్ …
Read More »నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్ నోటిఫికేషన్లు త్వరలో!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ నిరుద్యోగ యువతకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఇప్పటికే 16 వేలకుపైగా ఉపాధ్యాయ కొలువుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా, ఏపీపీఎస్సీ కూడా పెండింగ్‌లో ఉన్న పలు ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు రంగం సిద్ధం చేసింది. నిజానికి, ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »సినీ నటి జెత్వానీ కేసులో ట్విస్ట్.. మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు అరెస్ట్!
గత ప్రభుత్వ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పీఎస్‌ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి, ఏపీకి తరలిస్తున్నారు. జెత్వానీ కేసులో పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులుని విచారించనున్నారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్, ఐఏఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్టు అయ్యారు. విజయవాడ పోలీసులు ఆయనను హైదరాబాదులో అదుపులోకి తీసుకొన్నారు. ముంబై నటి, మోడల్ కాందాంబరి జెత్వానీ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ …
Read More »పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. రేపే పబ్లిక్ పరీక్షల ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) విడుదలవనున్నాయి. వీటితోపాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాలు కూడా బుధవారం విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయారామరాజు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే ‘మనమిత్ర’ (వాట్సాప్), లీప్ (ఎల్‌ఈఏపీ) మొబైల్ యాప్‌లోనూ ఫలితాలు అందుబాటులో …
Read More »