Kadam

ప్రధాని నోట ఆదివాసీ మాట.. దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న ఆదిలాబాద్ పేరు..!

భారతదేశంలో AI ప్రాధాన్యత పెరుగుతుందని.. మారుమూల గిరిజన గ్రామాల్లోను ఏఐని వినియోగిస్తున్నారని.. అందుకు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఉపాధ్యాయుడు తొడసం కైలాసే నిదర్శనమని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తొడసం కైలాస్.. అడవుల జిల్లా ఆదిలాబాద్, మావల మండలం వాఘాపూర్, గ్రామానికి చెందిన గోండి (భాష) రచయిత.ఆదిలాబాద్ జిల్లా పేరు మరోసారి దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఓ ఆదివాసీ ఉపాధ్యాయుడి చేసిన కృషిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంతో ఆదిలాబాద్ జిల్లా ఆనందంలో మునిగితేలుతోంది. తమ భాష యాసను బ్రతికించుకునేందుకు ఆదివాసీ ఉపాధ్యాయుడు …

Read More »

మఖానాతో ఇన్ని అనర్థాలా.. వీటి పోషకాలతో వారికి పెను ప్రమాదం

బరువు తగ్గాలనుకునేవారికి, ఆహార నియమాలు పాటించే వారికి పరిచయం అక్కరలేని పేరు పూల్ మఖానా. దీని వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి సోషల్ మీడియాలోనూ కుప్పలు తెప్పలుగా సమాచారం లభిస్తోంది. మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున వీటిలో గొప్ప యాంటీ ఏజింగ్ ప్రభావం ఉంటుంది. ఇది యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, అసలు సమస్యంతా వీటి గురించి పూర్తిగా తెలియకుండా ఎక్కువ మొత్తంలో తినేవారికే కలుగుతుంది..ఇటీవల 2025-26 …

Read More »

రాత్రి నిద్రకు ముందు గ్లాసుడు ఈ నీళ్లు తాగారంటే.. మీ ఒంట్లో ఎన్ని మార్పులో!

ఆరు ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ లవంగాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా లవంగం నీటిని తాగడం వల్ల చిన్న పిల్లలలో సాధారణంగా కనిపించే కడుపు నొప్పులు, రాత్రిపూట గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది..లవంగాలు ప్రతి ఇంటి వంటగదిలో ఉంటాయి. దీని సువాసన ఆహార రుచిని రెట్టింపు చేస్తాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అంతే కాకుండా లవంగం నీటిలో వివిధ ఆరోగ్య …

Read More »

పదో తరగతి మెమోలను ఎట్లా ముద్రిచాలో.. గ్రేడింగా? మార్కులా? విద్యాశాఖ తర్జనభర్జన

తెలంగాణ పదో తరగతి మార్కుల మెమోలను ఎట్లా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తెగ ఆలోచిస్తుంది. పదో తరగతిలో గ్రేడింగ్‌ విధానం ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విద్యాశాఖ.. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అందించే మెమోలను మార్కులా? లేదా గ్రేడింగా? ఎలా ముద్రించాలన్న దానిపై ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఏ పద్ధతిలో ముద్రించాలన్న అంశంపై తర్జనభర్జన పడుతుంది..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు …

Read More »

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఒంటి పూట బడులు ఎప్పటినుంచంటే..?

హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వడదెబ్బ సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పెరుగుతన్న ఎండల నేపథ్యంలో పిల్లలకు ఒంటి పూట నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యకమవుతుంది.తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పొద్దున 10 దాటగానే సూర్యుడు యాక్షన్‌లోకి దిగిపోతున్నాడు. మార్చి కూడా రాకుండానే ఎండల తీవ్రత ఓ రేంజ్‌లో పెరిగింది. దీంతో రోడ్ల వెంట బండ్లు పెట్టుకుని చిన్న.. చిన్న వ్యాపారాలు చేసేవారు అల్లాడిపోతున్నారు. ఇక బళ్లకు వెళ్లే …

Read More »

ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం.. వైసీపీ డిమాండ్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

ప్రతిపక్ష హోదా విషయంలో తగ్గేదేలే.. అని వైసీపీ నేతలు అంటుంటే.. అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదేలే.. అంటున్నారు కూటమి నేతలు.. ఏపీ బడ్జెట్‌ సమావేశాల వేళ వైసీపీ-కూటమి నేతల మధ్య విపక్ష హోదా మరోసారి అగ్గి రాజేసింది. ప్రతిపక్ష హోదా మా హక్కు అని ఫ్యాన్ పార్టీ డిమాండ్‌ చేస్తుంటే.. అడుక్కుంటే LOP హోదా ఇవ్వరని కౌంటర్ ఇస్తోంది సర్కార్‌.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు గవర్నర్ నజీర్ ప్రసంగించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ.. స్వర్ణాంధ్ర విజన్‌ ఆవిష్కరణే లక్ష్యంగా …

Read More »

20 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు కూన రవికుమార్. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే నిన్న మాజీ సీఎం జగన్ సహా వైసీపీ MLAలంతా సభకు.. ఆ వివరాలు ఇలా..ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు కూన రవికుమార్. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే నిన్న మాజీ సీఎం జగన్ సహా వైసీపీ MLAలంతా సభకు …

Read More »

ఏపీ మిర్చి రైతులకు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన

ఏపీ రాజకీయాల్లో ఘాటు పెంచిన మిర్చి ఎపిసోడ్‌లో శుభం కార్డు పడింది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఇక తెరపడినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో మిర్చి రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ కింద మద్దతు ధర ఇస్తామంది.ఏపీ రాజకీయాలను గత కొన్ని రోజుల పాటు మిర్చి పంట కుదిపేసింది. వైసీపీ అధినేత జగన్‌ ..గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్లి అక్కడి సమస్యలపై మాట్లాడారు. ఇక అప్పటి నుంచి రాజకీయాల్లో మిర్చి ఘాటెక్కింది. మిర్చి రైతులను ఆదుకోవాలని ప్రతిపక్షం.. …

Read More »

దూరం నుంచి మెరుస్తూ కనిపించాయ్.. ఏంటా అని దగ్గరిగా వెళ్లి చూడగా..

11వ శతాబ్దంలో ప్రస్తుత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన కళ్యాణి చాళుక్య యువరాణి అక్కాదేవికి చెందిన రెండు బంగారు నాణేలు తెలంగాణ రాష్ట్రంలో లభించాయి. దీనిని అరుదైన ఆవిష్కరణగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నాణేలు తెలంగాణలోని మాడుగుల గ్రామం సమీపంలో లభించాయి. వాటిపై కన్నడ భాషలో 11వ శతాబ్దపు అక్షరాలతో కూడిన శాసనాలు ఉన్నాయి.కళ్యాణి చాళుక్య యువరాణి అక్కాదేవికి చెందిన రెండు బంగారు నాణేలు తెలంగాణలో తొలిసారిగా లభించాయని భారత పురావస్తు సర్వే (ASI) తెలిపింది. ఈ నాణేలు మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల …

Read More »

 మందు బాబుల‌కు బ్యాడ్ న్యూస్.. 3 రోజులు మ‌ద్యం షాపులు బంద్!

రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యుల (MLC) ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఫిబ్రవరి 25న ఉదయం 6:00 గంటల నుండి ఫిబ్రవరి 27న ఉదయం 6:00 గంటల వరకు వైన్ షాపులు బంద్‌ అవుతాయి..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మందు బాబుల‌కు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా 3 రోజుల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వ‌ర‌కు మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయ‌నున్నట్లు ఎక్సైజ్ …

Read More »