ఈ రోజుల్లో చాలా మందిరికి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జీవనశైలిలో మార్పులు, ఉద్యోగాల్లొ ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు పెరిగిపోతున్నాయి. గుండె నరాలు మూసుకుపోతే శరీరంలో కనిపించే లక్షణాలు ఏవో తెలుసుకుందాం.. గుండె ధమనులలో రక్తం గడ్డకట్టడం, వాపు, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం ప్రారంభమైనప్పుడు గుండెకు ఆక్సిజన్ అందకపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల గుండె ధమనులు మూసుకుపోతాయి. దీని ప్రారంభ లక్షణాలు చెమటలు పట్టడం, ఛాతీ నొప్పి, నిరంతర నొప్పి మొదలైనవి. వీటిలో గుండెపోటు, …
Read More »ఆ నగరానికి ఏమైందీ? వారానికో హత్య.. ఆరు నెలల్లో మొత్తం 24 ఖూనీలు..!
గత రెండు మూడు నెలలుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హత్యలన్నీ ఆ నగరంలోనే జరిగాయి కాబట్టి. అందునా.. తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం అది. ఆ సిటీ పేరు.. ఓరుగల్లు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలైతే.. వరంగల్-హన్మకొండ-కాజీపేట్ ట్రైసిటీ. తెలంగాణకు అన్‌అఫీషియల్ క్యాపిటల్‌గా చూస్తుంటారు ఈ ఏకశిలానగరాన్ని.తెలుగు రాష్ట్రాల్లో హత్యాకాండ సిరీస్ నడుస్తోందా అనే అనుమానం వస్తోంది ఈ వరుస ఘటనలు చూసి వరుస హత్యలు, హత్యాయత్నాలు చెరగని రక్తపు మరకలు పడేలా చేస్తున్నాయి. ఓరుగల్లులో బరితెగిస్తున్న దుండగులు నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తున్నారు. కత్తులు …
Read More »కన్యాదానం తంతు ముగియగానే.. పెళ్లి కుమార్తె తండ్రికి గుండెపోటు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా
చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు… నిండుగుండెలు నిలువునా ఎండిపోతున్నాయి. ఉన్నపళంగా ఊపిరి ఆగిపోతోంది… ఇక్కడ అంబులెన్సుల్లేవ్… హాస్పిటల్ ట్రీట్‌మెంట్లూ లేవు. కళ్ల ముందే జీవితాలు ఆవిరైపోతుంటే కళ్లు తేలేస్తున్నాం… తప్ప ఏమీ చెయ్యలేని అచేతనావస్థ మనది. తాజాగా తెలంగాణలో మళ్లీ అలాంటి కేసు వెలుగుచూసింది.పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.. ఎలాంటి సమస్యలు లేకపోయినా.. మనిషి ప్రాణాలు క్షణాల్లో ఆవిరైపోతున్నాయి. అప్పటి వరకూ ఎంతో యాక్టివ్‌గా ఉన్నా అంతలోనే కుప్పకూలిపోతున్నారు. హార్ట్.. స్ట్రోక్.. ఈ పేరు వింటేనే.. గుండె వేగం పెరిగితోంది. రక్తం చిక్కబడినా.. రక్తం గడ్డకట్టినా.. గుండె ఆగిపోయినట్టే. …
Read More »కుప్పకూలిన SLBC సొరంగం.. టన్నెల్‌లో 50 మంది కార్మికులు..! హుటాహుటిన బయల్దేరిన మంత్రి ఉత్తమ్..
ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో టన్నెల్‌లో 50 మంది కార్మికులు ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఘటనా స్థలానికి వెళుతున్నారు నాగర్ కర్నూల్ ఎస్పీ భవ్ గైక్వాడ్.శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్‌లో ప్రమాదం జరిగింది..ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలింది. 14వ కి.మీ దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు కుంగింది. ఎడమ వైపు …
Read More »ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాకిచ్చిన కేంద్ర హోం శాఖ! 24 గంటల్లో అక్కడ రిపోర్ట్ చేయండి..!
అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది. డీజీ అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన తెలంగాణ డీజీపీగా కూడా గతంలో పనిచేశారు. అభిషేక్ మహంతి ప్రస్తుతం కరీంనగర్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభిలాష బిస్త్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్ర హోం శాఖ షాకిచ్చింది. ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి రిలీవ్ చేస్తూ.. 24 గంటల్లోగా …
Read More »దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం కలిగిన ఆలయంగా యాదగిరిగుట్ట
ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానం గోపురం స్వర్ణమయమైంది. 23న సుదర్శన లక్ష్మీనరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్వర్ణ విమానావిష్కరణకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం పూజలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, …
Read More »హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం.. అడ్డుకుంటామని VHP ప్రకటన
హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం నెలకుంది. మే 4 నుంచి 31వరకు తెలంగాణలో ‘మిస్ వరల్డ్’ పోటీలు నిర్వహణకు ప్లాన్ చేశారు. హైదరాబాద్ వేదికగా గ్రాండ్ ఫినాలే, ప్రారంభ-ముగింపు వేడుకలు జరగనున్నాయి. మిగతా ఈవెంట్స్ కోసం రామప్ప, యాదాద్రి, లక్నవరం, అనంతగిరి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణలో అందాల పోటీల నిర్వహణను విశ్వ హిందు పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అడ్డుకుని తీరుతామని చెబుతోంది. గతంలో కూడా భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయ్. 1996, 2024లో ముంబై వేదికగా ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. ఇప్పుడు …
Read More »ఏపీ తన వాటాకు మించి నీళ్లు వాడుకుంది – కృష్ణా రివర్‌బోర్డుకు తెలంగాణ లేఖ
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీళ్లన్నీ తమకే చెందుతాయని తెలంగాణ కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. ఏపీ ఇప్పటికే తన వాటాకు మించి వాడుకుందని, ఈ పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరింది. నాగార్జునసాగర్ నుంచి, శ్రీశైలం నుంచి ఏపీ ఇప్పటికీ నీటిని తీసుకుంటోందని, ఆ రాష్ట్రానికి కేటాయించిన దానికంటే మించి వాడుకొన్నా మళ్లీ నీటి వినియోగ ప్రణాళిక ఇమ్మని రెండు రాష్ట్రాలను కోరడం ఏంటి ప్రశ్నిస్తూ తెలంగాణ నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఫిబ్రవరి 11 …
Read More »శ్రీశైలంలో అన్యమతస్తుల దుకాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
శ్రీశైలం దేవస్థానం పరిసరాల్లో అన్యమతస్తులకు దుకాణాలు కేటాయించవద్దని 2015లో అప్పటి ఏపీ ప్రభుత్వం జీవో 425 జారీ చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. జీవో 425పై 2020లో స్టే విధించింది. అయితే.. స్టే ఉన్నప్పుటికీ ఏపీ ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవడంతో శ్రీశైలం ఆలయ పరిధిలోని కొందరు దుకాణదారులు మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లారు. దాంతో.. సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా.. దుకాణాల వేలం టెండర్లను పొరపాటున జారీ చేశామని.. …
Read More »ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. రేఖ గుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా హిందీలో ప్రమాణం చేశారు. అలాగే.. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ సీఎం …
Read More »