ఎన్నో రోజుల వైద్యుల కళ నెరవేరబోతుంది.రేపు సీఎం చేతులమీదుగా కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి శంకుస్థాపన జరగనుంది.అత్యాధునిక వైద్య,నిర్మాణ సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం కాబోతుంది.గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయం తో ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది.హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయం తో ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది.30 డిపార్ట్ మెంట్ లు,2వేల పడకలు,ఫిజియోథెరపీ ,డెంటల్, కాలేజ్ లు,హాస్టల్ వసతి తో …
Read More »తెలంగాణ ఇంటర్ బోర్డ్ vs ప్రైవేటు జూనియర్ కాలేజీలు.. యవ్వారం ఎక్కడిదాకా వెళ్తుందో?
ఇంటర్ బోర్డు వైఖరిపై తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీలు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు తమ కాలేజీలను సెంటర్లుగా ఇవ్వబోమని తెగేసి చెబుతున్నాయి. దీంతో మరో నెల రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానుండగా.. పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1125 కాలేజీలు బోర్డు నిబంధనలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టాయి.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు సెంటర్లపై సందిగ్ధత ఏర్పడింది. ఇంటర్ బోర్డు వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రైవేటు జూనియర్ …
Read More »ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే ధృవపత్రాల జారీ !
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ మరో శుభవార్త తీసుకువచ్చింది. పౌరసేవల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం(జనవరి 29) సమీక్ష నిర్వహించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం జనవరి 30వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. …
Read More »ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు.. పరీక్ష ఎప్పుడంటే?
నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని పేదింటి విద్యార్ధులకు ప్రతీయేట స్కాలర్ షిప్ లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది తొలిసారిగా యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షను నిర్వహించేందుకు ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కింది ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మొదటిసారిగా యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎక్సెల్ సివిల్స్ అకాడమీ డైరెక్టర్ రాజేంద్రకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. యూపీఎస్‌సీ …
Read More »టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం
టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యదగిరి గుట్ట పవిత్రత కాపాడేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విధివిధానాల రూపకల్పన చేయాలని అన్నారు. ఈ మేరకు బుధవారం తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో, ధర్మకర్తల మండలి (యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్ బోర్డు) ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాకు పలు సవరణలను సీఎం ప్రతిపాదించారు..తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) తరహాలోనే యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి …
Read More »ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సీఎస్ విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చెయనున్న నేపథ్యలో.. హరీష్ కుమార్ గుప్తా నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు..నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. పూర్తి అదనపు బాధ్యతలతో గుప్తాను డీజీపీగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ …
Read More »విజయవాడ, విశాఖ మెట్రోపై బిగ్ అప్‌డేట్.. ఎగిరి గంతేసే వార్త.. వివరాలు ఇవిగో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూసేకరణకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రెండు నగరాల్లో తొలిదశ పనులకు రూ.11,009 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డీపీఆర్‌లను కేంద్రానికి ఆమోదం కోసం పంపిన రాష్ట్ర ప్రభుత్వం, 100% నిధులు ఇవ్వాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మెట్రో ప్రాజెక్టుల ప్రగతి విజయవాడలో 66 కి.మీ, విశాఖపట్నంలో 76.9 కి.మీ పొడవునా డబుల్ …
Read More »ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల రద్దుపై ఇంటర్ బోర్డు యూటర్న్.. ఇక రద్దు లేనట్లే!
ఇంటర్మీడియట్ విద్యామండలి కొత్తగా ప్రతిపాదించిన సంస్కరణలపై విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తే వచ్చే ప్రతికూలతల గురించి విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు పరీక్షలపై శ్రద్ధ తగ్గుతుందని, చదువుపై దృష్టిపెట్టరని జనవరి 26 స్వీకరించిన సలహాలు, సూచనల్లో వారు పేర్కొన్నారు..రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానం …
Read More »తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకూ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 11న స్క్రూటినీ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ ఉపసంహరణకు ఫిబ్రవరి 13 చివరి తేదీగా ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, …
Read More »మృత్యు లారీలు.. హైదరాబాద్‌లో హెవీ వెహికిల్స్ ఎంట్రీపై టీవీ9 ఎఫెక్ట్.. పోలీసుల అలర్ట్..
షేక్‌పేట్ రోడ్డుప్రమాద ఘటనతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. నో ఎంట్రీ సమయం తర్వాత సిటీలోకి వస్తున్న భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కొరఢా ఝుళిపిస్తున్నారు. పంజాగుట్ట సర్కిల్‌లో తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు.. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, వాటర్ ట్యాంకర్స్, మినీ లోడ్ వాహనాలపై ఫైన్‌లు విధించారు.ప్రజల ప్రాణాలంటే వేళాకోలంగా ఉందా?…లారీలను, హెవీ వెహికల్స్‌ను వేళాపాళాలేకుండా సిటీలోకి ఎలా అనుమతిస్తున్నారు? నో ఎంట్రీ నిబంధనలు తుంగలో తొక్కుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? నో ఎంట్రీ టైమ్‌లో సిటీలోకి దూసుకొచ్చిన లారీ …
Read More »