మందుబాబులకు శుభవార్త.. అక్కడ మద్యం ధరలపై భారీ తగ్గింపు

ఏపీలో కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. బుధవారం, గురువారం అమ్మకాలు ఊపందుకున్నాయి.. అన్ని బ్రాండ్ మద్యం అందుబాటులోకి రావడంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. కొత్త మద్యం పాలసీ రావడంతో బార్ల నిర్వాహకులు దెబ్బకు దిగొచ్చారు.. మద్యం ధరలు తగ్గించారు. మొన్నటి వరకు బార్లలో రెండింతలకు మద్యాన్ని రెండింతల ధరలకు విక్రయించేవారనే విమర్శలు ఉన్నాయి. బుధవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో.. మద్యం షాపుల్లో నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో బార్ల దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి.

కొత్త మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో మందుబాబులు ఎగబడుతున్నారు.. కొత్త షాపులు ఎక్కడ చూసినా సరే కళకళలాడుతున్నాయి. ఈ ప్రభావం బార్లపై ప్రభావం కనిపించింది.. అక్కడ మందుబాబుల తాకిడి తగ్గడంతో.. భారీ తగ్గింపు ధరలకు మద్యం అంటూ బార్ల దగ్గర ప్రత్యేకంగా ప్లెక్సీలు పెట్టారు. తిరుపతిలోని ఓ బార్ దగ్గర ఫ్లెక్సీ కనిపించింది. ‘ఈ బార్ నందు భారీ తగ్గింపు ధరలలో మద్యం లభించును’ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఉదాహరణకు.. గతంలో 9 హార్స్‌ మద్యం క్వార్టర్‌ సీసా ప్రభుత్వ మద్యం షాపులో రూ.130కి విక్రయిస్తుంటే.. బార్లలో రూ.180కి విక్రయించేవారు.. ఇప్పుడు అదే బార్‌లో ఈ రూ.140కే విక్రయిస్తున్నారు. బార్‌లో అధిక ధరల మద్యం ఎమ్మార్పీకే విక్రయిస్తున్నారు.

మరోవైపు సీపీఐ నేత నారాయణ విజయవాడ దుర్గాపురంలో నూతనంగా ప్రారంభించిన మద్యం షాపును సందర్శించారు. ధరలు ఎలా ఉన్నాయో స్వయంగా ఆరా తీశారు.. షాపు యజమాని దగ్గర ఒక సీసా తీసుకుని, దాని ధర అడిగారు. యజమాని రూ.180 అని చెప్పగా.. ప్రభుత్వం రూ.99లకే ఇస్తామని ప్రకటించింది కదా అని ప్రశ్నించారు. కొత్త బ్రాండ్లు వచ్చాయని.. అందుకే ధర పెరిగిందని యజమాని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం విధానం కొత్తసీసాలో పాత సారాలా ఉందని వ్యాఖ్యానించారు నారాయణ.

రాష్ట్రంలో మద్యాన్ని ఆదాయ వనరుగా చేయడం ప్రజాశ్రేయస్కరం కాదన్నారు నారాయణ. దీని ద్వారా ఇప్పటికే రూ.3వేల కోట్లు వచ్చాయని.. డిపాజిట్ల ద్వారా మరో రూ.3వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం చెబుతోందని.. ఇది మంచిది కాదన్నారు. గత ప్రభుత్వం మద్యాన్ని కేంద్రీకరించి అవినీతికి పాల్పడిందని.. ప్రస్తుత ప్రభుత్వం వికేంద్రీకరణ అంటోందన్నారు. మద్యం విక్రయాలపై సెస్సు విధించి.. దాంతో మందుబాబులకు పునరావాసం కల్పిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.

About amaravatinews

Check Also

అయ్యో దేవుడా.. ఆ తల్లికి ఎందుకంత శిక్ష వేశావ్‌..? తల్లడిల్లిన కన్నపేగు

అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకు.. నిండా ఐదేళ్లు కూడా నిండని పసి మొగ్గ.. ఆ తల్లి కళ్ల ముందే లారీ చక్కాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *