BSNL Selfcare App : జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు రీఛార్జ్ ప్లాన్లు పెండటంతో.. ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) ఊపందుకుంది. ఇతర నెట్‌వర్క్ వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులు ఇతర కంపెనీల సిమ్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ పెట్టుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన బీఎస్‌ఎన్‌ఎల్ చౌకైన ప్లాన్‌లను సైతం అందిస్తోంది. అంతే కాకుండా.. వినియోగదారుల కోసం నిరంతరం కొత్త ప్లాన్‌లను కూడా తీసుకువస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ 4G నెట్‌వర్క్‌పై నిరంతరం పని చేస్తోంది.
ఎలాగైనా.. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పని చేస్తోంది. ఇటీవల ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. స్పామ్ కాల్‌లను నివారించేందుకు చర్యలు చేపట్టగా.. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ కూడా రంగంలోకి దిగింది. స్పామ్ కాల్‌లను నివారించడానికి కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. మీరు మీ బీఎస్‌ఎన్‌ఎల్ నంబర్‌కు వచ్చే స్పామ్ సందేశాల గురించి బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ (BSNL Selfcare) యాప్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయొచ్చు. ప్రస్తుతం ఇలాంటి సదుపాయం మరే కంపెనీకి లేదు.