మీరు కరీంనగర్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా.? కానీ ఖర్చు విషయంలో వెనకాడుతున్నారా.? అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ కోసం ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) బడ్జెట్ టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. మరి ఆ ప్యాకేజీ వివరాలు ఏంటి.? ఈరోజు మనం తెలుసుకుందాం.. ఐఆర్సిటిసి ప్రకటించిన ప్యాకేజీ పేరు కరీంనగర్ నుండి తిరుపతి. దీని SHR005A. ఈ టూర్ ప్యాకేజీలో తిరుపతి, శ్రీ కాళహస్తి కవర్ అవుతాయి. అయితే ఈ టూర్ ప్రతి గురువారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ …
Read More »టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు.. కారణం ఇదే!
తిరుమల తిరుపతి దేశస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ.రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. రాజశేఖర్ బాబు టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఈవో శ్యామలరావు అతన్ను సస్పెండ్ చేశారు. కాగా తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన రాజశేఖర్ టీటీడీలో ఏఈవోగా పనిచేస్తున్నారు. అయితే ఇతను ప్రతీ ఆదివారం స్థానికంగా ఉన్న చర్చిలో ప్రార్థనలు చేసేందుకు వెళ్తున్నారని.. అక్కడ ప్రార్థనల్లో పాల్గొంటున్నారని స్థానిక భక్తల నుంచి టీడీకి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన …
Read More »శ్రీవారి భక్తులకు ఓ మంచి కబురు.. టీటీడీ మరో కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి వైభవాన్ని చాటి చెప్పడంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణకు టిటిడి పుస్తక ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారి భక్తులకు ఇకపై పుస్తక ప్రసాదం చేయనుంది. మతమార్పిడిలను సమూలంగా అరికట్టి సనాతన ధర్మాన్ని చాటి చెప్పేలా టీటీడీ చర్యలు చేపట్టింది. సనాతన ధర్మ వైభవం, విశిష్టతపై అవగాహన కలిగించేందుకు పుస్తక ప్రసాదం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచనలతో పుస్తక ప్రసాదం కార్యక్రమాన్ని విసృత్తంగా చేపట్టబోతోంది హిందూ ధర్మ ప్రచార పరిషత్. దళిత వాడలు, మారుమూల కుగ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో …
Read More »గోవిందా గోవింద.. ఇకపై సాయంత్రం అన్నప్రసాదంలోనూ వడ
తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు వడలు ఇప్పుడు రెండు పూటలపాటు అందిస్తున్నారు. ఈ విధంగా ప్రతి రోజు 70,000 నుండి 75,000 వడలు అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అందుతున్నాయి. తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు వడలు ఇప్పుడు రెండు పూటలపాటు అందిస్తున్నారు. జులై 7 నుండి సాయంత్రం సెషన్‌లో కూడా వడలను టీటీడీ భక్తులకు వడ్డిస్తోంది. మార్చి 6 నుంచి మధ్యాహ్న సమయంలో అన్నప్రసాదంలో వడను ఇస్తున్నారు. ఇప్పుడు రాత్రి భోజన సమయంలో …
Read More »ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుపతి, కాచిగూడ రూట్లలో 48 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే!
రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో, ప్రయాణికుల రద్దీ దృష్ట్రా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండే రూట్‌లలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు ముఖ్యమైన మార్గాల్లో మొత్తం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. రోజురోజుకూ పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, వారికి ఇబ్బందులను తగ్గించి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండే …
Read More »సార్.. ముఖం చూసి అమాయకుడు అనుకునేరు..! శ్రీవారి సన్నిధిలో నృత్య ప్రదర్శన పేరిట చేతివాటం!
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన చోట నృత్య ప్రదర్శనంటే మామూలు విషయమా మరి.. అది కూడా తిరుమల ఆస్థాన మండపంలో నృత్యం చేసే ఛాన్స్ దొరికితే అంతకన్నా ఇంకేం భాగ్యం. కళాకారుల కోరికనే తెలంగాణకు చెందిన ఒక మోసగాడికి ఆదాయ వనరైంది. అక్రమంగా వసూలు చేసేందుకు అవకాశం కల్పించింది. తిరుమలలో నృత్య ప్రదర్శనలు ఇప్పిస్తానంటూ కళాకారులను అడ్డంగా దోచేసేందుకు మార్గమైంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సూత్రపు అభిషేక్ ఈ మేరకు ప్లాన్ పక్కాగా అమలు చేశాడు. అయితే అడ్డంగా దొరికి పోయాక …
Read More »తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఎగిసిపడ్డ మంటలు
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఆలయం సమీప గోపురం ముందున్న షాపులకు మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా షాప్ మొత్తం విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. రెండు షాపులు గద్ధమయ్యాయి. భారీ అగ్ని కీలలు ఎగిసిపడటంతో స్థానికులతోపాటు భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బుధవారం(జూలై 03) తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కి …
Read More »వేసవి చివరిలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. జూన్‌లో ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా
ఆపదమొక్కుల వాడు కోనేటి రాయుడు మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. జూన్ నెలలో సగటున 80వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది. అవును జూన్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలో లభించిందని టీటీడీ ప్రకటించింది.తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం కూడా ఇప్పుడు అంతకంతకు పెరుగుతుండటమే నిదర్శనం. తిరుమలేశుడి ఆదాయంలో హుండీ ఆదాయం కీలకంగా మారిపోవడంతో …
Read More »అవన్నీ అవాస్తవాలు.. భక్తులు నమ్మొద్దంటూ టీటీడీ విజ్ఞప్తి.. ఎందుకంటే
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరతారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కలు తీర్చుకుంటారు. అయితే తిరుమల క్షేత్రంలో హోటల్స్ లో లభించే ఆహారపదార్ధాల ధరల గురించి టీటీడీ తాజాగా ఓ ప్రకటన రిలీజ్ చేసింది.తిరుమల తిరుపతి క్షేత్రం హిందువులకు పరమ అవిత్రమైన స్థలం. కలియుగ వైకుంఠం క్షేత్రం తిరుమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. కోనేటి రాయుడి కోసం తిరుమలకు చేరుకుంటారు. …
Read More »తిరుమలలో చిరుత సంచారం.. అన్నమయ్య భవన్ సమీపంలో మాటువేసి..
చిరుతను మొబైల్ లో క్యాప్చర్ చేసిన యువకులు అటవీ ప్రాంతంలోకి తరిమేసే ప్రయత్నం చేసారు. ఆటో, బైక్ లైటింగ్ సాయంతో శబ్దాలు చేస్తూ చిరుతను తరిమేందుకు ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడే మాటు వేసిన చిరుత ఆ తరువాత అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడంతో అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్డులో వెళ్లేవాళ్లు, కంటి ఆసుపత్రికి వచ్చిన వారు ఊపిరి పీల్చుకున్నారు.శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న చిరుతలు జనాన్ని భయపెడుతున్నాయి. జనావాసాల్లోకి వచ్చి సందడి చేస్తుండడంతో భక్తుల్లో అలజడి రేపుతోంది. జులై 1 …
Read More »