తిరుపతి ఘటనకు బాధ్యత వహిస్తూ తాను ప్రజలకు క్షమాపణలు చెప్పానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. టీటీడీ ఈవో సహా అధికారులందరూ బాధితులకు క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. కొందరు అధికారులు పని చేయడం మానేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరైనా మహిళల జోలికి వస్తే తాటతీస్తానని హెచ్చరించారు.తప్పు ఎవరిదైనా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది కాబట్టే.. తిరుపతి ఘటనపై తాను క్షమాపణలు అడిగానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో తాను క్షమాపణ చెప్పినప్పుడు.. ఈవో, ఏఈవో క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఏంటని …
Read More »నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయానికల్లా ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు అత్యవసర సమావేశం నిర్వహించాలని అధికారులను టీటీడీ బోర్డు ఆదేశించింది. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.తిరుమలలో ఇవాళ సా.4 గంటలకు తిరుపతి తిరుమల దేవస్థానం (TTD) ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై ఈ సమావేశంలో తీర్మానించనున్నట్టుగా తెలిసింది. సాయంత్రం 4 గంటలకు …
Read More »తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధితులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేసింది. ఈ ఘటన తరువాత, సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గాయపడిన భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 52 మందికి ఈ అవకాశం కల్పించారు.తిరుపతి తొక్కిసలాట బాధితులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించారు అధికారులు. సీఎం ఆదేశాల మేరకు క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ. తొక్కిసలాటలో గాయపడి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారందరికీ ఈ …
Read More »తిరుపతి ఘటనపై సర్కార్ సీరియస్.. ముగ్గురు అధికారులపై వేటు..!
తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తిరుపతి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం నుంచి ఆరాతీసిన అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్‌రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే జేఈవో గౌతమిని బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ క్రమంలోనే తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. డీఎస్పీ …
Read More »తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు పూర్తి నివేదిక.. అందులో ఏముందంటే?
Tirupati Stampede: తిరుపతిలో మృత్యు ఘోష యావత్ రాష్ట్రాన్ని కలిచివేసింది. వైకుంఠ ద్వార దర్శన టోకెట్ల జారీ కేంద్రం… ఆరుగురిని బలితీసుకుంది. టోకెన్ల కోసం భక్తులు ఊహించని రీతిలో రావడంతో తొక్కిసలాటలో 41 మంది గాయపడ్డారు. అయితే స్పాట్‌లో ఏం జరిగింది..? అధికారులు తీసుకున్న చర్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ వెళ్లింది.వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం జనవరి 8 బుధవారం ఉదయం బైరాగిపట్టెడ సెంటర్‌కు భారీగా చేరుకున్నారు భక్తులు. టోకెన్ల జారీ మొదలుపెట్టే వరకూ పక్కనే ఉన్న పద్మావతి పార్క్‌లోకి భక్తుల్ని …
Read More »తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తోపులాటలో ఆరుగురు మృతి చెందారు. రుయా, స్విమ్స్‌లో మరో 48 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్ల జారీ ప్రక్రియ నేపథ్యంలో ఈ దుర్ఘటన జరిగింది.తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మృతులకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇప్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ …
Read More »తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతులు వీరే.. ఏయే ప్రాంతాల వారు ఉన్నారంటే..
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. ఈ తొక్కిసలాట ఘటనతో రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.. టీటీడీ బైరాగిపట్టెడలో ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా.. 48 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన ఆరుగురిలో.. ఐదుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రుయాలో నలుగురు, సీన్స్ లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడ్డ క్షతగాత్రులకు వైద్య …
Read More »అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. ఆ వార్తలపై TTD సీరియస్
టీటీడీ మాజీ పీఆర్వో నిష్కా బేగం ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి.. భారీగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై టీటీడీ స్పందించింది. నిష్కా బేగం అనే వ్యక్తి ఎవరూ గతంలో టీటీడీ పీఆర్వోగా పనిచేయలేదని స్పష్టంచేసింది. ఈ వార్తల్లో నిజం లేదని.. అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత వైసీపీ …
Read More »శ్రీవారి భక్తులకు అలెర్ట్.. త్వరలో వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్లు రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడ లభ్యమవుతాయంటే..
తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు కార్యకమాల గురించి భక్తులకు తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేశామని చెప్పారు.వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు …
Read More »క్లాస్ రూమ్‌లో ఒంటరిగా విద్యార్థిని.. ఆమె వద్దకు వెళ్లి ప్రొఫెసర్ వికృత చేష్టలు
తిరుపతి SV అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. క్లాస్ రూమ్‌లో ఒంటరిగా ఉన్న స్టూడెంట్‌తో ఉమామహేష్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఉమామహేష్‌ను అదుపులోకి తీసుకొని తిరుపతి రూరల్ పీఎస్‌కు తరలించారు పోలీసులు.టెంపుల్ సిటీలో ఆచార్యుడి వక్రబుద్ధి బయట పడింది. క్లాస్ రూమ్‌లో ఒంటరిగా ఉన్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆచార్యుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర …
Read More »