ఆంధ్రప్రదేశ్

వాలంటీర్ వ్యవస్థ రద్దు?.. మంత్రి కీలక ప్రకటన

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై క్లారిటీ వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ మీద ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వాలంటీర్లకు టీడీపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. వాలంటీర్ల భవిష్యత్తు విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన …

Read More »

ఏపీలో ప్రభుత్వ టీచర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ బాధ ఉండదు, ఆదేశాలు వచ్చేశాయి

ఆంధ్రప్రదేశ్‌‌ ప్రభుత్వం టీచర్లకు శుభవార్త చెప్పింది. మరుగుదొడ్ల ఫొటోలు తీసి, అప్‌లోడ్‌ చేసే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో బాత్రూమ్‌ల ఫొటోలు తీసే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించారు. అంతకముందు ఆ పనిని ప్రధానోపాధ్యాయులు చేయాలని చెప్పినా.. యాప్‌ల భారం పెరిగిందంటూ రోజుకో ఉపాధ్యాయుడు చొప్పున ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్‌ చేసేవాళ్లు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఐఎంఎంఎస్‌ యాప్‌లో బాత్రూమ్‌లో ఫొటోలు …

Read More »

నాగార్జున సాగర్ సందర్శనకు వెళ్తున్నారా..? TGSRTC గుడ్‌న్యూస్

ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం డ్యాంకు వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా శ్రీశైలం డ్యాం నుంచి నాగర్జున సాగర్ డ్యాంకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు చేరుకుంది. అయినా ఇంకా ఫ్లో వస్తుండటంతో సాగర్ గేట్లను సైతం అధికారులు పైకి ఎత్తారు. మెుత్తం 20 గేట్లను 5 ఫీట్ల మేర పైకి …

Read More »

జగన్ సర్కార్ ఆ ప్రాజెక్టులన్నీ కొనసాగిస్తాం.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో వెనక్కి వెళ్లేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తమకు విధ్వంసం చేయాలన్న ఆలోచన లేదని.. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యం) విధానంలో పోర్టులను పూర్తి చేయాలని భావించిందని గుర్తు చేశారు. కానీ గత జగన్ ప్రభుత్వం వాటిని ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానానికి మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇపపుడు ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వడం భారంగా ఉందని.. ఒకవేళ ఆ నిబంధనలను …

Read More »

వేములవాడ భక్తులకు శుభవార్త.. ఇకపై తిరుమల తరహాలో, ఆ భక్తులకు ఫ్రీగా లడ్డూ..!

దక్షిణ కాశీగా పేరుపొందిన.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తుంటారు. రాజన్నను దర్శించుకునేందుకు.. సామాన్య భక్తులే కాదు.. వీఐపీలు కూడా పోటెత్తుతుండటం విశేషం. ఈ మధ్య వీఐపీ భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త వినిపించారు. తిరుమల తరహాలోనే.. వేములవాడలోనూ బ్రేక్‌ దర్శనానికి ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. శ్రావణమాసం తొలిరోజైన సోమవారం రోజు నుంచే ఈ బ్రేక్ దర్శనాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అయితే.. ఈ …

Read More »

ఏపీలో వాలంటీర్లకు మరో షాక్.. సాయంత్రం వరకు ప్రభుత్వం డెడ్‌లైన్, సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉండే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లను అలర్ట్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ఉద్దేశ్యంతో ఆయా క్లస్టర్ సభ్యులతో క్రియేట్‌ చేసిన వాలంటీర్‌ వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపులను తక్షణమే డిలీట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వా హయాంలో ఎటువంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు స్వయంగా తమ క్లస్టర్‌ పరిధిలో ఉన్న సభ్యులను చేర్చి వాట్సాప్‌ గ్రూపులను, …

Read More »

శ్రీశైలం మల్లన్నకు భారీగా ఆదాయం.. హుండీలో విదేశీ కరెన్సీ.. బంగారం, ఎన్ని కోట్లంటే!

శ్రీశైలం మల్లన్నకు హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. శుక్రవారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. శ్రీశైలం ప్రధాన ఆలయంలోని చంద్రావతి కల్యాణమండపంలో భక్తులు గత 29 రోజులుగా సమర్పించిన ఈ హుండీ లెక్కింపును నిర్వహించారు. హుండీ ద్వారా దేవస్థానానికి రూ.3,31,70,665 నగదు లభించింది. అలాగే 127 గ్రాముల బంగారం, 4.400 కిలోల వెండి ఉన్నాయి. 4,445 యూఏఈ దిర్హమ్స్‌, 489 అమెరికా డాలర్లు, 5 లక్షల విలువైన వియత్నాం డాంగ్స్, 108 ఖతార్‌ రియాల్స్‌, 90 థాయిలాండ్‌ …

Read More »

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీకి  వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్‌కు సమీపంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో శనివారం నుంచి ఈ నెల 6 వరకు పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని వాతావరణశాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు …

Read More »

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో పౌరసరఫరాలశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం సేకరణ విధానం, రేషన్‌ బియ్యం సరఫరా, డోర్‌ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ షాపుల ద్వారా అనేక రకాల సరకులు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. …

Read More »

ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. 53 లక్షల కుటుంబాలకు లబ్ధి

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా మరో 6.50 కోట్ల పనిదినాలు కేటాయించింది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీకి కేంద్రం అదనంగా ఆరున్నర కోట్ల పనిదినాలు కేటాయించిదని డిప్యూటీ సీఎం ట్వీ్ట్ చేశారు. ఫలితంగా 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. పనిదినాలుు పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పెరిగిన పని దినాల …

Read More »